పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలని ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒకే ఏడాది మూడు సినిమాలు ప్రకటించడం ఇదే మొదటిసారి అనుకుంటా. ఒక సినిమా రిలీజ్ అయితే కానీ, తర్వాతి సినిమా ఒప్పుకోని పవన్ కళ్యాణ్ సడెన్ గా మూడు సినిమాలు ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఈ మూడు సినిమాల్లో క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం పవన్ కి మొదటి పాన్ ఇండియా చిత్రం అవుతుంది.

 

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నో హిట్లు చూశాడు. అలాగే ఎన్నో ఫ్లాపులు చూశాడు. ఫ్లాప్ వచ్చినప్పుడు కుంగిపోలేదు. విజయాన్ని చూసి పొంగిపోలేదు. అందుకే ఆయన అభిమానులు విజయాలు వచ్చినపుడూ ఆయనతోనే ఉన్నారు. ఫ్లాపులు వచ్చినపుడూ ఆయనతోనే ఉన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ చెప్పినట్టు ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే చచ్చే వరకు పవన్ అభిమానిగానే ఉంటారు.

 

 

అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఒకానొక పాటకి చాలా ప్రత్యేకత ఉంది. పవన్ కళ్యాణ్ కి సమాజం పట్ల ఎలాంటి భావజాలం ఉందో ఆ పాటద్వారా అప్పుడే అందరికీ తెలియజేశాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించినపుడు పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసం అన్న స్లోగన్ ఆ పాట నుండే వచ్చిందేమో అనిపిస్తుంది. గుడుంబా శంకర్ సినిమాలోని లే.. లే.. లే.. అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది.

 

ఏదైనా చేయాలనుకుంటే ఈ రోజే చేయాలనీ, ఆలస్యం చేయొద్దని మనల్ని ప్రేరేపించే ఈ పాట ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సమాజంలో చెడు ఉంది.. మంచి ఉందని చెప్తూ చెడ్డోళ్లకి చెడు చేయడమే మంచని చెప్తాడు రచయిత.. మణిశర్మ సంగీతం అందించినఈ పాటకి సాహిత్యం చంద్రబోస్ గారు రాశారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో గుర్తుండిపోయే పాటల్లో ఈ పాటకి మొదటి స్థానం దక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: