అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కాగా హీరోగా నటించిన తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న పవన్, ఆ తర్వాత నుండి వరుసగా మంచి సక్సెస్ఫుల్ సినిమాల్లో నటిస్తూ హీరోగా మంచి క్రేజ్ ని సంపాదించి ముందుకు సాగారు. ఇక ఆయన కెరీర్లో ఏడో సినిమాగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమా అప్పట్లో అతి పెద్ద సంచలన విజయాన్ని అందుకుంది. 

IHG

యూత్ ఫుల్ లవ్ స్టోరీ విత్ యాక్షన్ కథాంశంగా తెరకెక్కిన ఆ సినిమా అనంతరం దాదాపుగా రెండు రోజుల ఏళ్ళు గ్యాప్ తీసుకున్న పవన్, 2003లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తొలిసారిగా తాను దర్శకత్వం వహించిన సినిమా జానీ. రేణు దేశాయ్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు స్వయంగా పవన్ అందించడం జరిగింది. రమణ గోగుల సంగీతం అందించిన ఈ సినిమాకి చోటా కె నాయుడు, శ్యామ్ పాలవ్ సినిమాటోగ్రఫీ అందించారు. అయితే ఆ సినిమాలోని జానీ పాత్ర కోసం పవన్ పడిన కష్టం అంతా ఇంతా కాదని ఇప్పటికీ ఆయన అభిమానులు చెబుతూ ఉంటారు. అప్పట్లో కొన్నాళ్లపాటు తన డైటింగ్ లో ఎన్నో మార్పులు చేసి చాలా తక్కువ శాతం ఫుడ్ మాత్రమే తీసుకుని, నిత్యం  అలుపెరగకుండా ఎక్సరసైజ్ లు చేసి ఎంతో స్లిమ్ గా తన బాడీని మెయింటెయిన్ చేశారు పవన్. 

 

కాగా ఆ సినిమా కోసం కొన్నాళ్లపాటు సరిగ్గా తిండి కూడా తినని పవన్, ఒకానొక సమయంలో విపరీతమైన కడుపు నొప్పికి గురైన సందర్భాలు కూడా ఉన్నాయట. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయనకు అపెండిసైటిస్ ఆపరేషన్ కూడా జరిగింది. కాగా దీనిని బట్టి ఆ సినిమాలోని జానీ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ పడిన శ్రమ, కష్టం గురించి తెలిసి ఇప్పటికీ ఆయన అభిమానులు లోలోపల కొంత ఆవేదన చెందుతూ ఉంటారు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా వారిని బాధించే మరొక అంశం ఏమిటంటే, ఈ సినిమా కోసం పవన్ ఎంతో కష్టపడినప్పటికి, ఫైనల్ గా మాత్రం జానీ సినిమా రిలీజ్ తరువాత పెద్ద పరాజయాన్ని మూట కట్టుకోవడం......!!

మరింత సమాచారం తెలుసుకోండి: