వాస్తవానికి 2012 కు ముందు కొన్నేళ్ళ పాటు ఎక్కువగా పరాజయాలు అందుకుంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పట్లో సరైన సక్సెస్ కోసం ఎంతో వేచి చూశారు. అయితే అదే ఏడాది యువ దర్శకుడు హరీష్ శంకర్ లో దర్శకత్వంల వచ్చిన బాలీవుడ్ మూవీ దబాంగ్ కు రీమేక్ గబ్బర్ సింగ్. ఇక గబ్బర్ సింగ్ సినిమా అప్పట్లో అతిపెద్ద సంచలన విజయాన్ని అందుకుంది. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమాని బండ్ల గణేష్, తన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ వండర్ఫుల్ మ్యూజిక్ ని అందించారు. 

 

పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన హరీష్ శంకర్ ఒరిజినల్ దబాంగ్ సినిమాని కొన్ని మార్పులు చేర్పులు చేసి తెలుగు గబ్బర్ సింగ్ ని తెరకెక్కించడం జరిగింది. దేవిశ్రీప్రసాద్ అందించిన అత్యద్భుతమైన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అదిరిపోయే విజువల్స్, మెస్మరైజింగ్ ఫైట్స్, యాక్షన్ సీన్స్, తో పాటు ఈ సినిమాలో మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదిరిపోయే మాస్ యాక్షన్ తో పాటు ఆయన పలికే పవర్ఫుల్ డైలాగ్స్ ఇప్పటికీ అక్కడక్కడ పవన్ ఫ్యాన్స్ నోటి నుండి తూటాలుగా పేలుతూనే ఉంటాయి. 'జో డర్ గయా సంజో మర్గయా'  'నాక్కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది' 'నాకు నువ్వే కాదు ఎప్పుడూ ఎవడూ పోటీ రారు రాలేరు, నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ' 'నేను ఆకాశంలో లాంటోడిని, ఉరుము వచ్చినా మెరుపు వచ్చినా పిడుగు పడినా ఎప్పుడూ ఒకేలా ఉంటాను' 'నేను ట్రెండ్ ఫాలో అవను ట్రెండ్ సెట్ చేస్తాను' వంటి డైలాగ్స్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 

 

వాస్తవానికి పవన్ కి ఫ్యాన్ అవడం వల్లనే హరీష్ శంకర్ ఇంత అద్భుతంగా డైలాగ్స్ రాశారు అని ఇప్పటికీ ఆయన పై పవన్ ఫ్యాన్స్ హరీష్ పై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. ఇక అతి త్వరలో వీరిద్దరి కాంబోలో రాబోతున్న తదుపరి సినిమా కూడా దీన్ని మించేలా ఉంటుందని ఇటీవల హరీష్ శంకర్ ఒక ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పడం జరిగింది. దానితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: