యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో కొన్నేళ్ళ క్రితం వచ్చిన సినిమా యమదొంగ. చిన్నప్పటినుంచి దొంగగా తన జీవితాన్ని సాగించే ఒక యువకుడు అనుకోకుండా ఒక అమ్మాయిని డబ్బు కోసం కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత ఆమె కిడ్నాప్ వల్లనే హత్యకు గురికావడం, ఆపై యమలోకానికి వెళ్లి అక్కడ యముడితో ఏకంగా ఆయన కుర్చీ కోసమే పోరాటానికి దిగడం జరుగుతుంది. ఆ తర్వాత పలు ఆసక్తికర మలుపులతో మంచి కమర్షియల్ హంగులతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో అతిపెద్ద విజయాన్ని అందుకుంది. 

 

ఇక ఈ సినిమాకు ముందుగా నటించిన రాఖీ సినిమాలో ఎన్టీఆర్ ఎంతో బొద్దుగా ఉండేవారు. అయితే తన సినిమా కోసం తప్పనిసరిగా బరువు తగ్గాల్సిందే అని రాజమౌళి నియమం పెట్టటం, దాన్ని ఎన్టీఆర్ అనుసరించడం జరిగింది. ఇక ఈ సినిమాలో చాలా చోట్ల ఎంతో స్లిమ్ గా కనపడే ఎన్టీఆర్ డాన్సులు మరింత అదరగొట్టి ఫ్యాన్స్ లో మంచి జోష్ నింపారు. అలానే ఈ సినిమా సక్సెస్ కి ఎన్టీఆర్ పలికిన కొన్ని డైలాగులు కూడా కారణమని చెప్పాలి.

 

ముఖ్యంగా యమలోకం వెళ్లిన తరువాత, గతంలో ఆయన తాతయ్య నందమూరి తారక రామారావు నటించిన దాన వీర శూర కర్ణ లో పలికిన 'ఏమంటివి ఏమంటివి' డైలాగ్ ని నేటి మానవుల జీవితాలకి ఆపాదిస్తూ ఎన్టీఆర్ పలికిన విధానం ఎంతో అద్భుతం అనే చెప్పాలి. ఎంతో భారీ లెంగ్త్ గల ఆ డైలాగుని ఎన్టీఆర్ సునాయాసంగా చెప్పటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవానికి అంతకుముందు బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన నరసింహుడు సినిమాలో రైతుల గురించి ఎంతో గొప్పగా ఒక భారీ డైలాగ్ ని ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. ఇక యమదొంగలో ఆయన పలికిన ఏమంటివి ఏమంటివి డైలాగ్ కి అప్పట్లో థియేటర్స్ లో చపట్ల వర్షం కురిసింది. ఇక ఇప్పటికీ కూడా నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనిపించే ఆ డైలాగ్ వినబడితే చాలు ఎన్టీఆర్ ఆయన అభిమానుల్లో అలానే ప్రేక్షకుల్లో ఒకింత పులకరింత కనపడుతుంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: