మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాగా చెప్పుకునే సినిమా అతడు. ఈ సినిమా ప్రేక్షకులకు ఏ స్థాయిలో నచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా... టాలీవుడ్ లో ఇప్పటికీ ఫేమస్ ఏ. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు డైలాగులు, సోను సూద్ డైలాగులు ప్రేక్షకులకు బాగా నచ్చాయి అనేది వాస్తవం. ఈ సినిమాలో మహేష్ నటన కంటే కూడా డైలాగ్స్ బాగా ఫేమస్ అయ్యాయి. అందులో ప్రధానంగా చెప్పుకునేవి కొన్ని ఉన్నాయి. 

 

గన్ చూడాలి అనుకో తప్పు లేదు. బుల్లెట్ చూడాలి అనుకోవద్దు చచ్చిపోతావ్ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అలాగే సినిమా మధ్యలో ఫ్యామిలీ సన్నివేశాల్లో మహేష్ బాబు నోటి నుంచి వచ్చిన కొన్ని డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇల్లు ఇంత బాగుంటుంది అని తెలియదు అత్తయ్య అంటూ ,మహేష్ చాలా సింపుల్ గా చెప్తాడు. అది చాలా మంది ప్రేక్షకులకు నచ్చింది. ఇక ఈ సినిమాలో... త్రిష మహేష్ బాబు సంభాషణలలో ఉండే డైలాగ్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పవచ్చు. 

 

నేను కూడా వస్తాను అంటే నేనే వస్తాను అంటూ త్రిష తో మహేష్ చెప్పిన మాట బాగా నచ్చింది ప్రేక్షకులకు. నిజం చెప్పకపోవడం అబద్దం. అబద్దాన్ని నిజం చెయ్యాలి అనుకోవడం మోసం. నేను అబద్దం మాత్రమే చెప్పాను మోసం చేయలేదు అని మహేష్ చెప్పిన డైలాగ్ క్లాస్ ఆడియన్స్ కి బాగా నచ్చింది అనే చెప్పవచ్చు. అదే విధంగా తప్పు చేసావ్ మల్లీ, మన ఇద్దరి మధ్య స్నేహం ఉంది గాని చచ్చే అంత ప్రేమ లేదు గా... ఒకరినొకరు చంపుకునే పగలు కూడా మనకు లేవు గా అనే డైలాగ్ బాగా నచ్చింది కొందరికి.

మరింత సమాచారం తెలుసుకోండి: