నందమూరి బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా చెప్పుకునే చిత్రం ఏదైనా ఉందీ అంటే అది బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమా. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్  హిట్ అనేది స్పష్టంగా అర్ధమవుతుంది సినిమా చూసిన వాళ్లకు. ప్రతీ సీన్ కూడా చెక్కినట్టు తీసారు బోయపాటి. ఇక బాలకృష్ణ మార్క్ ఎక్కడా తగ్గకుండా ఆయన రేంజ్ కి తగిన విధంగానే డైలాగులను రాస్తూ వచ్చారు. ఈ సినిమాలో బాలకృష్ణ నోటి నుంచి వచ్చిన కొన్ని డైలాగులు ఇప్పటి వరకు వినపడుతూనే ఉన్నాయి. 

 

ఆ సినిమాలో ప్రధానంగా చెప్పుకునేది... చరిత్ర అంటే మాది... వాళ్ళది బురద జాతి అంటూ ఒక డైలాగ్ చెప్తారు.  అలాగే మరో సీన్ లో జగపతి బాబు కి ఎదురు పడిన సందర్భంలో బాలకృష్ణ నోటి నుంచి వచ్చే డైలాగులు ఉంటాయి. ఓటర్ ని అనుకున్నావా బె షూటర్ ని కాల్చి పారేస్తా కొడకా అంటూ బాలయ్య కొన్ని డైలాగులు ఒక చిన్న సీన్ లో చెప్తారు. ఇవి కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అదే సినిమాలో చివర్లో... క్లైమాక్స్ సీన్ లో బాలయ్య నోటి నుంచి వచ్చిన కొన్ని డైలాగులు ఇప్పటికి టిక్ లో వినపడుతూ ఉంటాయి. 

 

ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయంలో కొన్ని చెప్తారు. ఆ సినిమాలో చాలా సన్నివేశాలు డైలాగులతోనే ఉంటాయి. తరం మారినా తత్వం మారలా... అనే డైలాగ్ కూడా బాగా హిట్ అయింది అనే చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ రేంజ్ బాగా పెరిగింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సినిమా నుంచి బాలకృష్ణ సినిమాల మీద అభిమానులకు బాగా ఆసక్తి పెరిగింది. ఈ సినిమా తర్వాత ఆయనతో సినిమా చేయడానికి కొందరు దర్శకులు పోటీ పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: