టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ సినిమాలు అనగానే ప్రేక్షకులు ముందు ఎదురు చూసేది సినిమాలో ఉండే డైలాగుల కోసం. సినిమా ఎలా ఉన్నా సరే డైలాగ్ తో సినిమాను ముందుకు నడిపించడం బాలకృష్ణ సొంతం. బాలకృష్ణ ఏది మాట్లాడినా సరే అది డైలాగ్ మాదిరిగానే ఉంటుంది అనే టాక్ కూడా ఉంది. కథ ఎలా ఉన్నా సరే అందులో బాలకృష్ణ నటన తో పాటుగా డైలాగులు ఎక్కువగా హైలట్ అవుతూ ఉంటాయి. దర్శకులు కూడా ఆయనకు ప్రత్యేకంగా డైలాగులు ఉండే విధంగా జాగ్రత్తలు పడుతూ ఉంటారు. 

అందులో భాగంగా చూస్తే బాలకృష్ణ నటించిన చెన్న కేశవ రెడ్డి సినిమా ఆయన కెరీర్ లో బాగా హిట్ అయింది. సినిమా పరంగా చూస్తే క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోకపోయినా ఆయన డైలాగుల్లో ఎక్కువ భాగం ఆ సినిమా నుంచి ఇప్పటికి వినపడుతూనే ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకునేది... సత్తిరెడ్డి అనగానే వెనుక నుంచి క్వాలిస్ లు లేచే సీన్. ఆ సీన్ పెద్దది పేరు చిన్నది. ఇక అదే సినిమాలో ఎప్పుడో మాటలు రానప్పుడు చూసాను. ఇప్పుడు అదే నోటి నుంచి సలహాలు వింటున్నాను అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ కూడా బాగా నచ్చింది జనాలకు. 

 

అలాగే  జైలు సీన్ లో బాలకృష్ణ... ను మీ రక్తపు మరకల్లో ఇంకా వేడి తగ్గలేదు రెడ్డి గారూ అనగానే... బాలయ్య  నోటి నుంచి వినపడే డైలాగ్ ఇప్పటికి రాయలసీమ లో వినపడుతూనే ఉంటుంది. సీమ ది కదా ఇంకా కుత కుత లాడుతూనే ఉంటుంది అంటూ బాలకృష్ణ నోటి నుంచి వచ్చిన ఈ డైలాగ్ ఎంత గానో ఆకట్టుకుంది. టాలీవుడ్ లో ఈ సినిమా హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే ఈ సినిమాలో బాలకృష్ణ నోటి నుంచి వచ్చిన డైలాగులు మాత్రం బాగా క్లిక్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: