మెగాస్టార్ చిరంజీవి చెప్పే మేనరిజమ్స్, పంచ్ డైలాగులకు ఓ ప్రత్యేకత ఉంటుంది. వాటిలో చెప్పుకోదగ్గ భారీ పంచ్ డైలాగులు ఉన్న సినిమా ‘ఇంద్ర’. ఫ్యాక్షన్ కథల ట్రెండ్ లో చిరంజీవి చేసిన ఏకైక సినిమా ఇది. ఈ సినిమా ఏస్థాయి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలిసిన విషయమే. ఈ సినిమాలో ఫస్టాఫ్ కు పరుచూరి గోపాలకృష్ణ, సెకండాఫ్ లో పరుచూరి వెంకటేశ్వర రావు పదునైన డైలాగులు రాసారు.

 

 

తన కూతురిని ప్రేమించాడని తెలుసుకుని చిరంజీవి మేనల్లుడిని ఎత్తుకొచ్చి కొట్టబోతాడు షౌకత్ ఆలీఖాన్. అప్పుడు చిరంజీవి అడ్డుపడి తాను దెబ్బలు తింటాడు. అక్కడ ఫైట్ ఉండదు. కానీ.. చిరంజీవి అన్ని దెబ్బలు తిన్నాక రియాక్షన్ ఆశించే అభిమానులకు అక్కడ ఒకే ఒక్క డైలాగ్ తో సీన్ మొత్తం చిరంజీవి వైపుకు టర్న్ అయిపోతుంది. ‘షౌకత్ ఆలీ ఖాన్.. తప్పు నావైపుంది కాబట్టి తలొంచుకు వెళ్తున్నాను.. లేదంటే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లే వాడిని’ అన్న డైలాగ్ ధియేటర్లో దద్దరిల్లిపోయింది. ఓ భారీ ఫైట్ కు సరిసమానంగా ఉండే ఆ డైలాగ్ ను చిరంజీవి అదేస్థాయిలో చెప్పడం సినిమాకే హైలైట్ అయింది.

 

 

సెకండాఫ్ లో.. చిరంజీవి కాశి నుంచి తన ఊరు వెళ్తాడు. విలన్ గ్యాంగ్ ఇంటికెళ్లి వార్నింగ్ ఇచ్చే సమయంలో చిరంజీవి చెప్పిన పంచ్ డైలాగ్స్ అదరగొట్టేస్తాయి. ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా..’, ‘రాననుకున్నావా.. రాలేననుకున్నావా. కాశీకి పోయాడు కాషాయం మనిషైపోయాడు.. వారణాశికి పోయాడు వరస మార్చాననుకున్నావా.. అదే రక్తం అదే పౌరుషం’, ‘సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది.. ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’ ఈ డైలాగులతో ధియేటర్లు దద్దరిల్లిపోయాయి. ‘ఇంద్ర’ తిరుగులేని ఇండస్ట్రీ హిట్ సాధించి చిరంజీవికి, మెగా ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా నిలిచింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: