మనిషి జీవితంలో సినిమా కూడా ఒక భాగమైంది.. రెండున్నర గంటల సినిమా చూసి తమ జీవితంలో జరిగే మంచి చెడులను విశ్లేషించుకుంటాడు సగటు ప్రేక్షకుడు. కొందరు ఇంకాస్త ముందుకెళ్లి సినిమా ఇచ్చిన ఉత్సాహంతో.. నేర్పే పాఠంతో జీవితాన్ని గెలుస్తారు. ఒక సినిమాను చాలా రకాలుగా తీస్తారు దర్శకులు.. స్టార్ హీరో కమర్షియల్ యాంగిల్ సినిమాలు చేస్తే.. ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను నవ్వించడమే పనిగా వచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి. 

 

మాములుగా మనం బయట మాట్లాడుకునే భాషకు సినిమా భాషకు కొద్దిగా తేడా ఉంటుంది. అదేంటి అది కూడా తెలుగే కదా అని అనుకోవచ్చు. సినిమా భాష అందంగా ఉంటుంది.. అందంగా ఉండేలా రాస్తారు. అందుకే సినిమాలో మాటలు బాగా అనిపిస్తాయి. అయితే సినిమా హాస్యంలో పంచ్ అనేది ఇప్పుడు బాగా వినిస్తున్న పదం. ఇప్పుడేదో కొత్త రచయితలు వచ్చి డైలాగుల సంచినిండా పంచులు వేస్తున్నారని అనుకోవచ్చు కానీ ఈ పంచ్ డైలాగులు అప్పటి జంధ్యాల దగ్గర నుండి మొదలైంది. జంధ్యాల తీసిన ప్రతి సినిమాలో ప్రతి పాత్ర హాస్యానికి ప్రతిరూపంగా ఉంటాయి. ఓ పక్క కథ నడిపిస్తూనే మరో పక్క పాత్రల స్వభావంతో మెప్పిస్తాడు. 

 

జంధ్యాల నుండి ఇప్పటి త్రివిక్రమ్ వరకు సినిమాకు పంచులేస్తూ.. సినిమాను ప్రేక్షకుల హృదయపు అంచుల దాకా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు రోత పుట్టించే హాస్యాన్ని కామెడీ అనుకుని భ్రమలో ఉన్న ప్రేక్షకులు ఒక్కసారి వీళ్ళ కామెడీ చూస్తే షాక్ అవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పంచులు ప్రవాహంలో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుస్తున్నారు దర్శకులు. ఏదైనా విషయాన్ని మాములుగా చెప్పేదాన్ని కన్నా పంచ్ వేసి చెబితే బాగా గుర్తుండేలా ప్రేక్షకుడిని సెట్ చేశారు మన రచయితలు.                 

 

మరింత సమాచారం తెలుసుకోండి: