అబ్బాయిలు అంటే లక్ష్యం అంటూ లేకుండా  నచ్చిన అమ్మాయి వెంట పడుతూ, ఫ్రెండ్స్ తో టైం పాస్ చేస్తూ బేవార్స్ గా తిరిగివాళ్ళు కాదు.. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి.. అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి.. నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెద్దలకు చెప్పి ఒప్పించాలి అని అనుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది.. ఇంకా మీకు అర్థం కాలేదా?  అయితే నేనింతే సినిమాలో హీరో రవి తేజాలాగా అనుకోండి.. 

 

ఈ సినిమాలో హీరోకు ఒక గోల్ ఉంటుంది.. ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు.. కానీ ఏదైనా గెలిచే వరుకు ఉనా విషయం చెప్పే దైర్యం చెయ్యడు రవితేజ.. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి మనసులో ఉండే మాటలే ఈ సినిమాలో డైలాగ్స్ లా చెప్తారు.. అవి వింటే మన మనసులో మాట కూడా ఇదే కదా రా. అని అనిపిస్తుంది.. అలాంటి డైలాగ్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

1. రూపాయి సంపాదించలేని ఏ ఏడవకి 'ఐ లవ్ యు' చెప్పే అర్హత లేదు. 

 

2. లైఫ్ అంటేనే పెయిన్, కొన్ని తప్పవు

 

3. మనిషన్నాకా ఏదో ఒక పిచ్చి ఉండాలి, ఏ పిచ్చి లేకపోతే ఎందుకు వెదవ జీవితం. 

 

4. డబ్బుకి ప్రేమ అక్కర్లేదు కానీ, ప్రేమకి డబ్బు కావాలి. 

 

5. మనకున్న ప్రతి బంధానికి మూడు ఇవ్వాల్సి ఉంటుంది.. ప్రేమ, డబ్బు, సమయం. వీటిలో ఏ ఒక్కటి తగ్గినా ఆ బంధంలో సమస్యలు మొదలవుతాయి. 

 

6. ప్రపంచంలో ప్రతి ఒక్కరు స్వార్థపరుడే, ఇది ఎవరితోనైనా చెప్తే ఏ నా కొడుకు ఒప్పుకోడు. 

 

7. గొడవలు, కొట్లాటలలో ఇన్వాల్వ్ అయ్యేంత ఓపిక తీరిక అసలు లేవు మనకు. మన గోల గోలలు మనవి.. 

 

8. ప్రపంచంలోనే అతి ఖరీదైన మెషిన్ ఏంటో తెలుసా? మన శరీరం.. కోపం వచ్చినప్పుడల్లా మన వైర్లు.. అదే నరాలు అవి తెంపుకోకు. 

 

9. నాకోసం కాదు, నీ కోసం వేళ్ళు, ఎప్పుడు ఎవరి కోసం ఏది చేయకు, ఇది నీ జీవితం. 

 

10. మా అమ్మ, మా అక్క, మా చెల్లి, మా పెళ్ళాం వీళ్ళని కలపకుండా నన్ను తిట్టగలవా? నన్నే కాదు, ఆడోళ్లను కలిపి తిట్టకుండా మనిధిని తిట్టడానికి టైటిల్ ఉండవు.  

మరింత సమాచారం తెలుసుకోండి: