సంపూర్ణేష్ బాబు తన మూడవ సినిమా అయిన కొబ్బరి మట్ట లో మూడు అవతారాలలో కనిపించి దుమ్మురేపాడు. ఈ చిత్రంలో ఏకంగా మూడు నిమిషాల పైగా గుక్కతిప్పుకోకుండా సింగిల్ షాట్ లో ఒక క్లిష్టతరమైన డైలాగు చెప్పి వరల్డ్ రికార్డు సృష్టించాడు. మీకోసం ఆ సినిమాలోని రెండు పాపులర్ డైలాగులు ఈ ఆర్టికల్ ద్వారా తెలియజేయపోతున్నాం. వాస్తవానికి ఈ సినిమా పూర్తి హాస్యభరితమైన నేపథ్యంలో తెరకెక్కినప్పటికీ ఇందులోని స్త్రీ జాతి పై రాసిన డైలాగులు మాత్రం అందరినీ ఆలోచింపజేశాయి.


మొదటి డైలాగ్ "రేయ్...కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి, ఉంచాలా... ఊడ్చాలా... అని ఆలోచిస్తుంటే పుడతామో, చస్తామో తెలియని పరిస్థితులలో, ఎలాగోలా పుట్టేసి, పెరిగేసి, ఎదిగేస్తున్న టైములో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఎదవ కోసం... అన్న విషయం తెలిశాక... అమ్మనాన్న కలిసి పావుకిలో లడ్డూలు, అరకిలో చెకోడీలు పెట్టి... దున్నపోతు లాంటి ఓ పెళ్ళికొడుకుని తీసుకొచ్చి, తల దించుకొని పెళ్ళిలో, కళ్ళు దించుకుని శోభనం గదిలో పడుకుంటే గుండెల మీద తాళి బరువు, శరీరం మీద వాడి బరువు మోసి మోసి, వాడు వేసిన విత్తనాన్ని తొమ్మిది నెలలు మోసి ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చి, ప్రతి రోజు కోడి కంటే ముందే నిద్ర లేచి నుదిటిన బొట్టు పెట్టి, స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగ బెట్టి, కాఫీ పొడి, టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి, వాళ్ళను బడికి వెళ్ళగొట్టి, నిన్ను ఆఫీసుకి తరిమి కొట్టి ఒక చేత రిమోట్ మరో చేత కత్తిపీట పట్టుకొని చానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి తరిగి పదకొండు గంటలకు స్టార్ మహిళ చూస్తూ, ఇటు మధ్యలో వంట చేస్తూ..కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్ లో.. బ్రేక్ మధ్యలో అత్త గారికి అన్నం పెట్టి...ముద్ద మందారం, ఆడదే ఆదారం, మనసు మమత గోకులంలో సీత, స్వాతి చినుకులు అంటూ.. పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్ లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో..అలిసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తను తిని పడుకుంటుంది రా... అది రా ఆడదంటే అలాంటి నీ భార్యని వదిలేస్తానంటావా? బ్లడి ఫూల్", అంటూ హీరో సంపూర్ణేష్ బాబు చెప్పిన డైలాగ్ తెలుగు ప్రేక్షకులందరినీ కట్టిపడేసింది.


కొబ్బరి మట్ట చిత్రంలో స్త్రీ జాతి గురించి మరొక డైలాగు చెప్పి అందరి చేత వావ్ అనిపించాడు. "పెళ్ళాం అంటే పనిమనిషి అనుకుంటున్నావారా? అసలు ఏమనుకుంటున్నవురా ఆడదంటే, నీకు
చిన్నదౌతే చెల్లాతుంది, పెద్దదైతే అక్కౌతుంది, పెళ్ళి చేసుకుంటే భార్యౌతుంది, ఆ తరువాత
తల్లౌతుంది. మగాడిది ఏముందిరా ఆఫ్ఘాల్
తండ్రౌగలడు మగాడు, పురుషుడు అని పలకాలంటే పెద్ద కష్టమేమి లేదు..కాని 'స్త్రీ' అని పలకాలంటే నోట్లో కండరాలు, నాలుక అష్టవంకరలు తిరిగి కష్టపడాల్రా. నీ జీవితం కూడా అంతే. మన దేశంలో స్త్రీని గౌరవించటం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం, ఆ సాంప్రదాయం ఎంత గొప్పదంటే జంతువుల్ని కూడా పిల్లి పిల్లా, కుక్క పిల్లా, పంది పిల్లా అంటాం కాని పిల్లి పిల్లొడు, కుక్క పిల్లొడు, పంది పిల్లొడు అనము అంత గొప్పదిరా మన సాంప్రదాయం." అంటూ మరొక భారీ డైలాగును చెప్పాడు సంపూర్ణేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: