సినిమా రంగంలో ఉన్న సెల‌బ్రిటీలు ఎంత త్వ‌రగా ప్రేమించు కుంటారో ? అంతే త్వ‌ర‌గా పెళ్లి చేసుకుని విడిపోతూ ఉంటారు. మ‌రీ దారుణం ఏంటంటే పెళ్లి చేసుకుని 15 ఏళ్ల‌కు పైగా కాపురాలు చేసి విడిపోయిన వారు కూడా ఉంటారు. పెళ్ల‌య్యి ఇరవై ఏళ్లు కాపురం చేసి ఇద్ద‌రు, ముగ్గురు పిల్ల‌ల‌ను క‌ని వాళ్లు పెళ్లీడు కొచ్చాక కూడా విడిపోయిన దంప‌తుల‌ను మ‌నం ఎంత మందిని చూడ‌లేదు. కొంద‌రు స్టార్ హీరోలు ఏకంగా మూడు, నాలుగు పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ పాపుల‌ర్ సింగర్ గ‌తంలో ఓ పెళ్లి చేసుకుని ఆ భ‌ర్త‌కు దూర‌మైంది. స‌ద‌రు ముందు భ‌ర్త‌కు విడాకులు ఇచ్చాక ఇప్పుడు మ‌రో వ్య‌క్తిని పెళ్లాడింది. ఇక ఇప్పుడు రెండో భ‌ర్త‌కు కూడా ఆమె దూర‌మ‌వుతోంద‌న్న వార్త‌లు సంచ‌ల‌నంగా మారాయి.

 

పాపులర్ సింగర్ సునిధి చౌహాన్ తన భర్త నుండి విడిపోయింది అనే వార్త వైరల్ అయింది. దీంతో ఆమె భర్త స్పందించాడు. మీడియాలో, సోషల్ మీడియాలో తాము విడిపోయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు సునిధి భర్త హితేష్ సోనిక్ తెలిపాడు. సునిధి చౌహాన్ అటు బాలీవుడ్‌లో ఎన్నో సూప‌ర్ డూపర్ హిట్ సినిమాల్లో సూప‌ర్ డూప‌ర్ హిట్ పాట‌లు పాడింది. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చారిత్రాత్మ‌క సినిమా సైరాలో సైతం ఆమె పాట పాడిన సంగ‌తి తెలిసిందే.

 

ఇక తాజాగా బాలీవుడ్ వర్గాలవారి సమాచారం ప్రకారం సునిధి, హితేష్ గత కొంతకాలంగా విడివిడిగా నివసిస్తున్నారు. ఈ విషయాన్ని వారు ఎప్పుడూ బయటపెట్టలేద‌ట‌. ఇటీవ‌ల సునిధి, హితేష్ త‌మ స్నేహితుల‌తో క‌లిసి గోవా ట్రిప్‌కు వెళ్లార‌ట‌. అక్క‌డ వీరి మ‌ధ్య ఏర్ప‌డిన వివాదం కాస్తా పెరిగి పెద్ద‌ది అవ్వ‌డంతో ఇప్పుడు వీరిద్ద‌రు విడివిడిగా జీవిస్తున్న‌ట్టు పుకార్లు షికార్లు అయితే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. సునిధి, హితేష్‌లకు వివాహం జరిగి ఎనిమిదేళ్లు అయ్యింది. 

 

2010 నుంచి రెండేళ్లపాటు డేటింగ్‌‌లో ఉన్న తరువాత 2012లో వీళ్లు వివాహం చేసుకున్నారు.  సునిధి 2018 జనవరిలో ఒక కొడుకుకు జన్మనిచ్చింది. కాగా ఇది సునిధికి రెండవ వివాహం. 2002లో కొరియోగ్రాఫర్ బాబీ ఖాన్‌‌ను పెళ్లాడింది. తరువాత ఏడాదికి ఇద్దరూ విడిపోయారు. ఇక ఇప్పుడు రెండో భ‌ర్త‌కు ఆమె దూరం అవుతోంద‌న్న వార్త‌లు క‌ల‌క‌లంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: