టాలీవుడ్ లో టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ పెళ్లి ఇప్పటికే ఎన్నో రకాల కథనాలు వెలువడుతు వచ్చాయి.  ఏది ఏమైనా ప్రభాస్ పెళ్లి విషయంలో ఆయన పెద్దనాన్న కృష్ణ రాజు ఓ క్లారిటీ ఇస్తే కానీ కన్ఫామ్ కాదు అంటున్నారు.  ఇదిలా ఉంటే కొంత కాలంగా  ప్రభాస్ వివాహం  మెగా ప్రిన్సెస్, నాగబాబు తనయ నిహారికతో జరగనుందన్న వార్త కూడా వచ్చింది.  సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు ఎంత త్వరగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు..  ప్రభాస్ తో నిహారిక పెళ్లి ఖాయం అయినట్టే అన్న వార్తలు వచ్చాయి.  మరోవైపు ప్రభాస్ బొమ్మాళి అనుష్క మద్య ఏదో నడుస్తుందన్న పుకార్లు కూడా వచ్చాయి.

 

కానీ తాము మంచి స్నేహితులం అంటూ ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు.  తాజాగా  ఆన్‌లైన్ ద్వారా అభిమానులతో మాట్లాడిన నిహారిక వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.   ఓ అభిమాని  మీరు ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటున్నారా అక్కా.. అని అడిగారు. దీనికి స్పందించిన నిహారిక..  మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి. ఆ వార్తలన్నీ అవాస్తవాలు అస్సలు నమ్మోద్దు నా పెళ్లి విషయం  పెద్ద వాళ్ల నిర్ణయం మేరకే జరుగుతుంది. 

 

ప్రభాస్ ని పెళ్లి చేసుకోవడం నిజం కాద ని చెప్పింది.  ఇక మరో ప్రశ్నకు సమాధానంగా సాయిధరమ్ తేజ్ తనకు వరసకు బావే అయినప్పటికీ, అన్నయ్యతో సమానమని, తమ కుటుంబంలో వైష్ణవ్ తేజ్ బాగా దగ్గరని వ్యాఖ్యానించింది.  ప్రస్తుతం తాను కెరీర్ పరంగా ఆలోచిస్తున్నానని.. తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నానని అన్నారు.  మొత్తానికి మెగా అమ్మాయి  పెళ్లి చేసుకునే లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటోంది. ఒక మనసు తో కెరీర్ ప్రారంభించినా హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ మాత్రం కాలేకపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: