తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న నటుడు పవన్ కళ్యాణ్ . పవన్ కనిపిస్తే కుర్ర కారుకు ఆనందోత్సహాలు మరియు కేరింతలు కొడుతారు. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు 26 సినిమాలు కంప్లీట్  చేశాడు ఇప్పుడు ప్రస్తుతం బాలీవుడ్ రీమేక్ పింక్ ను తెలుగులో వకీల్ సాబ్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే . ఈ సినిమా తరువాత క్రిష్ దర్శకత్వంలో ఓ హిస్టారికల్ మూవీ కోసం సైన్ చేసిన విషయం తెలిసిందే . ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ సినిమాలు షూటింగ్ ను ఆపుకున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ నటించిన దాదాపు 12 చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. మరికొన్ని సినిమాలు కథను మార్చి ఇతర సినీ హీరోలతో చేసినవి వున్నాయి. 

 

పవన్ మరియు అమీషా పటేల్ కలసి నటించిన మరియు 2000 సంవత్సరంలో విడుదల కావలసిన 'చెప్పాలని వుంది' సినిమా ఆగిపోయింది ఎందుకంటే అదేసంవత్సరం లో రిలీజ్ అయినా నువ్వే కావాలి సినిమా ఒకే స్టోరీ లైన్ తో ఉండడంతో ఆ సినిమా మధ్యలోనే ఆపేశారు. 

 

సంగీతం శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ తో ఓ జీసుస్ సినిమాను ప్లాన్ చేశాడు. అయితే ఆ సినిమా ఇండస్ట్రీలో పెద్దలు వద్దని చెప్పడంతో ఆ సినిమా మొదలు పెట్టి సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది .

 

జానీ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ సొంతగా తయారు చేసుకున్న స్టోరీ సత్యాగ్రహి. ఆ సినిమాకి తానె డైరెక్షన్ చేయాలనుకున్నాడు ఆ సినిమాకు ఏఎం రత్నం కూడా ఓకే చెప్పాడు. ఈ సినిమాను అట్టహాసంగా ప్రారంభించారు కూడా .అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది.

 

తరువాత పవన్ కళ్యాణ్ తాను సొంతగా దేశభక్తి సినిమాకు స్టోరీ రాసుకున్నాడు కానీ ఆ సినిమా షూటింగ్ కు నోచుకోలేదు. 

 

డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాలనుకున్నాడు దానికి పవన్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు.కానీ ఈ సినిమా కూడా షూటింగ్ కి నోచుకోలేదు ...

 

డైరెక్టర్ మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్  తో కోబలి సినిమా ను చేయాలనుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఇతర సినిమాల్లో బిజీ గా ఉన్నందున ఆ సినిమా కూడా కుదరలేదు. కోబలి సినిమా కథనే కొద్దీ మార్పులు చేసి త్రివిక్రమ్ 'బృందావనం' గా తెరకెక్కించాడని అంటారు ...

 

ఇక పోతే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాను విక్టరీ వెంకటేష్ తో కలసి చేయవలసింది. సినిమా సెట్స్ పైకి వెళ్లే టైం కి పవన్ తప్పుకున్నాడు.తరువాత ఆ సినిమా ను మహేష్ టేక్ ఓవర్ చేసిన విషయం తెలిసిందే.

 

VV వినాయక్ పవన్ తో  సినిమా చేయాలనీ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు.ఆ మధ్య అనౌన్సమెంట్ కూడా అయ్యింది. కానీ ఆ సినిమా కూడా ఆగిపోయింది ...

 

సంపత్ నంది 'రచ్చ' సినిమా తరువాత మంచి జోష్ లో ఉన్నాడు .ఆ సమయంలో పవన్ తో రెండు సినిమాలు చేయడానికి ఒప్పుకున్నాడు .కానీ సెట్స్ పైకి వెళ్ళలేదు . 

 

కాటమరాయుడు కంటే ముందు ఎస్‌జే సూర్యతో ఓ సినిమా ప్రారంభించాడు పవన్. కానీ ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగిపోయింది.

 

తన భార్య రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో ఖుషి సీక్వెల్ చేయాలనీ ఏర్పాట్లు చేసింది. కానీ ఖుషి సినిమా సీక్వెల్ ప్రారంభానికి నోచుకోలేదు ....

 

మరింత సమాచారం తెలుసుకోండి: