తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి వారసుడు రానా కు  ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు హీరోగా   మరోవైపు విలన్ గా  ఇంకోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా  విభిన్నమైన పాత్రలను చేసుకుంటూ సెక్సస్  ఫుల్ గా కెరియర్ లో దూసుకుపోతున్నాడు  యువ నటుడు రానా. ఎలాంటి పాత్రలోనైనా నట విశ్వరూపాన్ని చూపించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకునే విధంగా తన నటనతో ఆకట్టుకున్నాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లీడర్ సినిమాతో తెలుగుతెరకు హీరోగా పరిచయమయిన రానా... మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. మొదటి సినిమాతోనే తనలోని నటనతో ఆకట్టుకున్న రానా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించాడు. 

 

 

 కేవలం తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా ఈ అవకాశాన్ని దక్కించుకున్నాడు. అటు హిందీలో ఘాజి అనే సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే రానా ఎన్ని సినిమాలు నటించినప్పటికీ రానాకు ఎక్కువ గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా. ప్రపంచవ్యాప్తంగా రానా అంటే ఎవరు అందరికీ తెలిసేలా చేసింది బాహుబలి సినిమా. బాహుబలి సినిమా రానా కెరియర్ను మార్చేసింది అని చెప్పాలి. అయితే మొదట లీడర్ సినిమాతో తెరమీదికి వచ్చిన తర్వాత ఎన్ని సినిమాలు తీసినప్పటికీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ బాహుబలి తర్వాత మాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు రానా. 

 

 

 అయితే తాను వెండితెరకు పరిచయమై 10 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా బాహుబలి సినిమా గురించి మాట్లాడారు. లీడర్ సినిమా తర్వాత తాను నటించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయని.. అలాంటి సమయంలో డైరెక్టర్ క్రిష్ కృష్ణం వందే జగద్గురుం అనే సినిమాలో తనకు అవకాశం ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నటన చూసిన రాజమౌళి బాహుబలి లో అవకాశం ఇచ్చారు అంటూ ఆయన తెలిపారు. బాహుబలిలో అవకాశం వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు తన బాడీని పాత్రకు తగ్గట్టు మలుచుకోవటంతో  పాటు పలు అంశాల్లో శిక్షణ తీసుకున్నాను అంటూ తెలిపాడు రానా . బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో తన కాలు బెనకడం తో ఆరు నెలలపాటు ఎంతగానో ఇబ్బందిపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: