టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లలో ఒకడు హరీషశంకర్.  తీసినవి కొన్ని సినిమాలే అయినా.. గుర్తుండి పోయేలా తీశారు.  అప్పట్లో పవన్ కళ్యాన్ తో గబ్బర్ సింగ్ మూవీతో టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సృష్టించాడు.  ఈ మూవీతో పవన్ కళ్యాన్ రేంజ్ ఎక్కడికో వెళ్లింది.  హిట్.. ఫ్లాప్ అనే తేడా లేకుండా తన సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత చాటుకుంటారు హరీష్ శంకర్. రచయిత కోన వెంకట్ సహకారంతో రవితేజ నటించిన వీడే సినిమాకు సహాయకుడుగా పనిచేశాడు. ఆ తర్వాత ఆటోగ్రాఫ్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.  రాంగోపాల్ వర్మ సహాయంతో షాక్ మూవీకి దర్శకత్వం ఛాన్స్ ఇచ్చాడు.. కానీ ఆ మూవీ సక్సెస్ కాలేదు.

 

తరువాత పూరీ జగన్నాథ్ తో కలిసి చిరుత, బుజ్జిగాడు సినిమాలకు రచనా సహకారం అందించాడు.  రవితేజ హీరోగా మిరపకాయ్ సినిమాకు దర్శకత్వం వహించాడు.  ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. రామయ్యా వస్తావయ్యా, సుబ్రమణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథం తర్వాత గత ఏడాది వరుణ్ తేజ్ తో గద్దల కొండ గణేష్ మూవీ తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు.  హరీష్ శంకర్ ఒక వైపున యూత్ ను .. మరో వైపున మాస్ ఆడియన్స్ ను అలరించేలా కథలను సిద్ధం చేసుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు.  త్వరలో పవన్ కళ్యాన్ తో ఓ మూవీకి దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే.

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు స్కూల్ డేస్ నుంచి ఓ కోరిక ఉండేదని.. కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి వంటివారి ప్రేరణతో నాటకాలపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది.  కొన్ని నాటకాల్లో నటించినందుకుగాను నాకు రాష్ట్రస్థాయిలో అవార్డులు కూడా వచ్చాయి. ఓ పెద్ద నాటకానికి దర్శకత్వం వహించాలని కోరిక తనకు ఎప్పటి నుంచో ఉందని అంటున్నారు.  ఆ కల నిజం చేసుకోవడానికిగాను నా వంతు కృషి నేను చేస్తాను అని చెప్పుకొచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: