ఫ్లాప్ డైరెక్టర్స్ కు ఛాన్సులు రావడం లేదు. అందుకే కనిపించడం లేదనుకుంటే.. అందులో అర్థముంది. ఒక్కోసారి ఫ్లాపులున్నా.. వరుసపెట్టి సినిమాలు చేసేస్తారు కొందరు. అయితే బ్లాక్ బస్టర్స్.. సూపర్ హిట్స్ ఇచ్చిన కొందరు దర్శకులు మాత్రం రెండు, మూడు ఏళ్లు గ్యాప్ లో  పడిపోయారు. 

 

భరత్ అనే నేను రిలీజ్ తర్వాత ఎవర్ని డైరెక్ట్ చేయాలన్న కన్ ఫ్యూజన్ లేకుండా.. చిరంజీవితో సినిమాకు కమిట్ అయ్యాడు కొరటాల శివ. అయితే చిరంజీవి సైరాతో బిజీగా ఉండటంతో.. డేట్స్ కోసం ఏడాదిన్నర వెయిట్ చేయాల్సి వచ్చింది. సినిమా గత దసరాకు లాంఛనంగా మొదలు కాగా.. ఆగస్ట్ లో రిలీజ్ కు సన్నాహాలు చేద్దామనుకున్నారు. కరోనా ఎఫెక్ట్ తో సినిమా మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి. 

 

సుకుమార్ ఒక్కో సినిమాకు రెండేళ్లు తీసుకుంటాడన్న పేరేగానీ.. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో చిత్రానికి కమిట్ అవుతాడు. నాన్నకు ప్రేమతో రిలీజ్ కాకుండానే.. రామ్ చరణ్ సినిమా ఒప్పుకున్నాడు. రంగస్థలం రిలీజైందో లేదో.. మహేశ్ ను డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. అయితే లెక్క మాస్టారు చెప్పిన కథ సూపర్ స్టార్ కు నచ్చకపోవడంతో.. అనుకోకుండా.. ఓ సంవత్సరం వేస్ట్ అయింది. 

 

లెక్కల మాస్టారు చెప్పిన కథ సూపర్ స్టార్ కు నచ్చకపోవడంతో.. ఇదే కథను బన్నీకి చెప్పి ఒప్పించాడు. అయితే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సెట్స్ పై ఉండటంతో.. సుకుమార్ సినిమా లేటయింది. సినిమా షూటింగ్ మొదలై పూర్తి కావడానికి ఏడాది పడుతుంది. ఈ క్రమంలో సుకుమార్ సినిమా వచ్చి మూడేళ్లవుతుంది. 

 

వెనకాల మహానటి లాంటి సెన్సేషనల్ హిట్ ఉన్నా.. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అంటున్నాడు నాగ అశ్విన్. మహానటి రిలీజై ఏడాదిన్నర తర్వాత ప్రభాస్ తో సినిమా ఎనౌన్స్ చేశాడు. డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెప్పినా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2021లో సెట్స్ పై వస్తుంది. 


ఒక ఫ్లాప్ పడితే.. తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు. అదేమిటో గానీ.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్సే ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారు. దాదాపు 50కోట్లు కలెక్ట్ చేసిన ఫిదా తీసిన శేఖర్ ఖమ్ముల తర్వాతి మూవీపై చాలా ఆసక్తి నెలకొంది. కొత్తవాళ్లతో తీస్తారని ప్రచారం జరిగినా.. ఎఠ్టకేలకు నాగచైతన్య, సాయిపల్లవి జంటగా లవ్ స్టోరీ తీస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: