తెలుగు వారి గుండెల్లో తెరవేల్పులా స్థిరపడిపోయిన వెండితెర ఇలవేల్పు నందమూరి తారక రామారావు. ఆయన నటనా కౌశలానికి నిలువుటద్దంలా నిలిచిన సినిమాలెన్నో ఉన్నాయి. క్లాసిక్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఎన్నో ఆయన ఖాతాలో ఉన్నాయి. రాజకీయాల్లోకి వచ్చాక నటనకు దూరమైన ఆయన అడపాదడపా సినిమాల్లో నటించారు. అలా నటించిన అతి తక్కువ సినిమాల్లో మేజర్ చంద్రకాంత్ ఒకటి. ఈ సినిమా విడుదలై నేటితో 27ఏళ్లు పూర్తి చేసుకుంది.

IHG

 

కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఆ సినిమా 1993 ఏప్రిల్ 23న విడుదలైంది. ఈ సినిమా అఖండ విజయం సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మిలిటరీ మేజర్ గా ఎన్టీఆర్ నటన నభూతో నభవిష్యతి అని చెప్పాలి. వయసుకు తగ్గ పాత్రలో టైటిల్ క్యారెక్టర్ ను ఎన్టీఆర్ పోషించారు. మోహన్ బాబు తన లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించి ఈ సినిమాలో హీరోగా నటించాడు. హీరోయిన్లుగా రమ్యకృష్ణ, నగ్మా నటించారు. ఈ సినిమాలో ని ఓ పాటలో ఎన్టీఆర్ సుభాష్ చంద్రబోస్, వీరపాండ్యకట్టబొమ్మన, అల్లూరి సీతతారామరాజు పాత్రలు పోషించారు. అల్లూరి సినిమా చేయలేదనే వెలితి ఎన్టీఆర్ కు ఈ సినిమా ద్వారా నెరవేరిందని అంటారు.

IHG

 

కీరవాణి సంగీతంలోని పాటలన్నీ సూపర్ హిట్టే. ‘పుణ్యభూమి నా దేశం..’ అని దేశభక్తి నేపథ్యంలో సాగే పాట ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. సినిమాలో మంచు మనోజ్ ఎన్టీఆర్ మనవడిగా నటించారు. భారీ విజయం సాధించిన ఈ సినిమా శతదినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా తిరుపతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నట దిగ్గజం సునీల్ దత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ కెరీర్లో చివరి బ్లాక్ బస్టర్ హిట్ గా మేజర్ చంద్రకాంత్ నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: