ప్రపంచం మొత్తం కరోనాతో విల విలలాడిపోతుంది.  ఎక్కడ చూసినా కరోనాతో మరణాలు సంబవిస్తున్నాయి. చిన్న దేశాలే కాదు.. అగ్ర రాజ్యాలు సైతం ఈ కరోనా రక్కసికి తల్లడిల్లి పోతున్నారు. మన దేశంలోకరోనా భారిపడకుండా లాక్ డౌన్ ప్రకటించారు. అందరూ ఇట్టిపట్టున ఉండాలని.. దాని వల్ల కరోనా వ్యాప్తి జరగకుండా ఉంటుందని అంటున్నారు.  గత నెల 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ షట్ డౌన్ అయ్యింది.  షూటింగ్స్ ఆగిపోయాయి.. రిలీజ్ లు వాయిదా పడ్డాయి. దాంతో సినీ కార్మికులు కష్టాల్లో పడ్డారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్న సినీ కార్మికుల కోసం ఆయా సినీ పరిశ్రమకు చెందిన వారు సహాయం చేస్తున్నారు.

 

టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన హిందీ సినిమా ‘మున్నామైఖెల్‌’తో  హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్.. ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.  గత ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ తో మంచి విజయం అందుకుంది. ఈ అమ్మడికి తెలుగు లో వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. తాజాగా నిధి అగర్వాల్ కరోనా పై పోరాటంలో భాగంగా తన వంతు సాయం చేయడానికి ముందుకొచ్చింది.

 

ఇందులో భాగంగా పీఎం కేర్స్‌తో పాటు టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన కరోనా క్రైసిస్ ఛారిటీకి తన వంతు విరాళం అందజేసింది. అంతే కాదు  జంతువులకు సంబంధించిన వెల్ఫేర్ ఆప్ స్ట్రే డాగ్స్‌తో, స్పూర్తి సంక్షేమ సంఘంతో పాటు సీఎం రిలీఫ్ పండ్‌కు విరాళం అందజేసినట్టు ప్రకటించింది.  కరోనా ఇబ్బందులు ఉన్నవాళ్లకు ఎంతో మంది సినీ సెలబ్రెటీలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వడం ఎంతో సంతోషం అని అందరికీ ధన్యవాదాలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: