కరోనా వైరస్ వల్ల సినిమా షూటింగ్ లు మొత్తం ఆగిపోయాయి. ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఎప్పుడూ సందడిగా ఉండే రోడ్లు నిర్మానుష్యంగా అయిపోయాయి. మందులేని ఈ వైరస్ ని అరికట్టడం కోసం వైద్యులు వ్యాక్సిన్ కనిపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియాలో కూడా ఈ వైరస్ రోజురోజుకు విస్తరిస్తోంది. లాక్ డౌన్ అమలులో ఉండటంతో అన్ని రంగాల్లో మూతపడ్డాయి. సినిమా షూటింగులు కూడా ఆగిపోవటంతో సెలబ్రిటీలు అంతా ఇళ్ళల్లోనే ఉన్నారు. ఇటువంటి తరుణంలో సోషల్ మీడియాలో ఈ లాక్ డౌన్ సమయాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారు వంటి విషయాల గురించి అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పుస్తకాలు చదువుతున్నట్లు తెలిపారు. అంతే కాకుండా ఆ పుస్తకాలు పేర్లు మరియు రాసిన వాళ్ళ పేర్లు ఫోటోలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాటి వివరాలు చూస్తే  

 

వెయ్యి పడగలు - విశ్వనాధ సత్యనారాయణ

చివరకి మిగిలేది - బుచ్చి బాబు

మైనా - శీలా వీర్రాజు

కీర్తి కీరీటాలు - యద్దనపూడి 

కాలతీత వ్యక్తులు - Dr. పి. శ్రీ దేవి

 

ఈ పుస్తకాలు చదువుతూ ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ ని ఆస్వాదిస్తున్నటు చెప్పుకొచ్చారు. ఈ ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ సంక్రాంతి పండుగకు బన్నీతో అలా వైకుంఠపురం లో సినిమాతో అదిరిపోయే విజయాన్ని సాధించడం జరిగింది. కాగా తన తర్వాత సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇలాంటి సమయంలో ప్రస్తుతం షూటింగ్ లు మొత్తం ఆగిపోవటంతో సెలబ్రిటీలు అంతా ఎవరికి వాళ్లు ఇళ్ళలో ఉంటూ కొంతమంది భార్యలకు హెల్ప్ చేస్తుంటే మరికొంతమంది వంటలు వండుతు లాక్ డౌన్ టైం ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది అయితే మీడియాలో లైవ్ లో పాల్గొని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కాగా త్రివిక్రమ్ మాత్రం పుస్తకాలు చదివే పనిలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: