టాలీవుడ్ లో ఇప్పుడు ఎవరి నోటి నుంచి విన్నా సరే రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా వార్తలే. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ జనం. ఈ సినిమా కోసం కొందరు అయితే ఇప్పటి నుంచే సెలవులు పెట్టాలి అనుకోవడం కూడా ఆశ్చర్యం కలిగించే విషయం. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా వాయిదా అపడింది. కరోనా తగ్గగానే సినిమా షూటింగ్ ని చిత్ర యూనిట్ మళ్ళీ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాతి షూటింగ్ పూణే లో జరుగుతుంది. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక వార్త బయటకు వచ్చింది. ఒక సన్నివేశంలో చిరంజీవి తో పాటుగా బాలకృష్ణ కూడా కనపడే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఒక ఊరి పెద్దగా చిరంజీవి నటించే అవకాశం ఉందని సమాచారం. బాలకృష్ణ పాత్ర ఏ విధంగా ఉంటుందో తెలియకపోయినా ఈ సినిమాలో ఆయన నటించడం ఖాయమని టాలీవుడ్ జనాలు అంటున్నారు. కథలో వారి కోసం ప్రత్యేకంగా కొన్ని సన్నివేశాలను దర్శకుడు సిద్దం చేసాడని వారికి ఉండే డైలాగులు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది అంటూ కొందరు మాట్లాడుతున్నారు. 

 

ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాను రాజమౌళి ఏ స్థాయిలో ప్రతిష్టాత్మకం గా తీసుకున్నారు అనేది ఆయన ఈ సినిమాకు కష్టపడే విధానం చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ లు ముగ్గురు నటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: