బాలయ్యకు మహేష్ బాబు సినిమాలోని పాట సరిపోతుంది. నలుగురు నడిచే రూట్లే నే నడువనురో అని చెబుతారు బాలయ్య. ఆయన ఎపుడు ట్రెండ్ ఫాలో అవరు. మాట ఇస్తే ఓకే అని  అలా ముందుకు పోతారు. అయితే బాలయ్య పీక్ స్టేజ్ లో ఉన్నపుడు అయితే ఓకే. కానీ..

 

ఇపుడు బాలయ్య ఫ్లాప్స్ లో ఉన్నారు. ఆయన కెరీర్ లో ఇపుడు ఒక విధంగా క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు. బాలయ్య గత మూడు సినిమాలు కూడా ఫ్యాన్స్ సైతం చూడలేదని అర్ధమవుతోంది. దాంతో లీస్ట్ కలెక్షన్స్ మొదటి రోజే వచ్చి మూవీస్ భారీ డిజాస్టర్లుగా మిగిలాయి. ఈ క్రమంలో బాలయ్య హిట్ కోసం పరితపిస్తున్నారు.

 

దాంతో తనకు రెండు సూపర్ హిట్లు ఇచ్చిన బోయపాటితో జట్టు కట్టారు. బాలయ్య, బోయపాటి మూవీ మీద అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరూ కసి మీద ఉన్నారు. కచ్చితంగా హిట్ కొడతారు అని కూడా అనుకుంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే బాలయ్యమూవీ తరువాత బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేయబోతున్నారుట. 

 


ఆ కాంబోలను వింటే మాత్రం ఫ్యాన్స్ పెదవి విరుస్తారు. అందులో మొదటిది ఒకప్పటి డైరెక్టర్ బి గోపాల్ డైరెక్టర్ గా ఒక మూవీట. నిజానికి బీ గోపాల్ ఒకపుడు బాలయ్యకు మంచి హిట్లు ఇచ్చారు. కానీ కొన్నాళ్ళుగా ఆయన సినిమాలు చేయడంలేదు. అటువంటి టైంలో ఆయనతో బాలయ్య మూవీ అంటే నిజంగా వండరే. మరి బాలయ్య ఏ ధైర్యంతో ఈ మూవీ ఒప్పుకుంటున్నారో అర్ధం కావడంలేదని అంటున్నారు.

 

ఇంకో వైపు చూస్తే పైసా వసూల్ మూవీని తీసిన డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తో కూడా ఇంకో మూవీకి బాలయ్య కమిట్ అయ్యారట. మరి బోయపాటి హిట్ కష్టపడి ఇచ్చినా ఆ సక్సెస్ ట్రాక్ ని బాలయ్య కంటిన్యూ చేస్తాడా అన్న డౌట్లు వచ్చేలా ఈ రెండు ప్రాజెక్టులు ఉన్నాయని ప్రచారం సాగుతోంది.  అన్నట్లు ఈ మూవీస్ బాలయ్య బర్త్ డే వేళ ప్రారంభం అవుతున్నాయట. చూడాలి ఈ మధ్యలో మార్పులు ఏమైనా ఉంటాయేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: