పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రేక్షకుల్లోనే కాదు స్టార్స్ లో కూడా సూపర్ క్రేజ్ ఉంటుంది. పవన్ అంటే సాటి హీరోగా కాకుండా అభిమానిగా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందులో మొదటిగా చెప్పుకోవాల్సి వస్తే లవర్ బోయ్ నితిన్ ఉంటాడు. పవన్ అంటే పడి చచ్చే ప్రేమ అభిమానం ఉన్న నితిన్  సినిమా ఈవెంట్ లో కూడా పవర్ స్టార్ పేరు ప్రస్తావించి.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ను కూడా రంజింపచేస్తాడు నితిన్. నితిన్ మాత్రమేనా మెగా హీరోలందరు ఈవెంట్ లో పవర్ స్టార్ అని అనాల్సిందే. 

 

ఇక మన స్టార్స్ చెప్పడం కాదు పవన్ క్రేజ్ గురించి.. ఆయన మీద ఉన్న అభిమానం గురించి బయట స్టార్స్ కూడా చెబుతారు. వారిలో కోలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు. తమిళ స్టార్స్ విజయ్, విక్రమ్ లతో సహా అందరు పవన్ క్రేజ్ గురించి వేరు వేరు సందర్భాల్లో ప్రస్తావించారు. తాము కూడా పవన్ కు పెద్ద ఫ్యాన్ అని చెప్పడం విశేషం. ఇప్పుడు అక్కడ స్టార్ గా ఉన్న వారే కాదు సూపర్ స్టార్స్ అయినా రజనికాంత్, కమల్ హాసన్ కూడా పవన్ గురించి.. అతని క్రేజ్ గురించి చెప్పుకొచ్చారు. తమిళ స్టార్స్ మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్స్ సైతం పవన్ క్రేజ్ ను చూసి షాక్ అయిన సందర్భాలు ఉన్నాయి.

 

సౌత్ స్టార్ అనగానే రజిని, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మోహన్ లాల్, మమ్ముట్టి, శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ ల తర్వాత పవన్పేరు వినిపించక తప్పదు. కెరియర్ మొదటి నుండి యువత మెచ్చే సినిమాలు తీస్తూ అలరించిన పవర్ స్టార్ సౌత్ స్టార్ కు లేనటువంటి క్రేజ్ ఏర్పరచుకున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్న పవర్ స్టార్ ఆ సినిమాతో పాటుగా మరో మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: