కొత్త డైరెక్టర్ అంటే ఎక్కువ సీనియర్ హీరోకే తెలుసు. వాళ్ల జడ్జిమెంట్ కు తిరుగులేదు. బాక్సాఫీస్ దగ్గర వాళ్లు చెప్పిందే రికార్డ్ అని చాలామంది అభిప్రాయపడుతుంటారు. కానీ బాలీవుడ్ ని కొన్నేళ్లుగా ఏలుతోన్న ఖాన్ త్రయం మాత్రం వాళ్లను వాళ్లు నమ్మలేకపోతున్నారు. సందేహాల పెహెన్ షా అనిపించుకుంటున్నారు. మిడిల్ డ్రాప్ ల మహారాజుల్లా మారుతున్నారు. 

 

ఖాన్ త్రయం వాళ్ల అనుభవంతో కథ వినప్పుడే రిజల్ట్ చెప్పేస్తారని టాక్. అందుకే వాళ్లు ఒక్కసారి ఓకే చెబితే చాలు సూపర్ హిట్ కొట్టామన్నంత ఆనందపడతారు నిర్మాతలు. కానీ ఈ అనుభవజ్ఞులు కూడా ఫస్ట్ ఓకే చెప్పి తర్వాత సారీ చెబుతుంటారు. సక్సెస్ వేటలో కొన్ని ప్రాజెక్టులను మిడిల్ డ్రాప్ చేస్తున్నారు. 


సల్మాన్ ఖాన్, సాజిద్ నదియ ద్వాలా కాంబినేషన్ లో కిక్ 2 వస్తుందని రెండేళ్ల క్రితమే ప్రకటించారు. కభీ ఈద్ కభీ దివాళి తర్వాత కిక్ 2 స్టార్ట్ అవుతుందని చెప్పారు. కానీ సాజిద్ సరైన లైన్ తీసుకురాలేదని, ఈ ప్రాజెక్ట్ ని క్లోజ్ చేశాడట సల్మాన్. 


అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత్. ఈ మైథలాజికల్ స్టోరీలో నటించాలని చాలా సార్లు చెప్పాడు. రెండేళ్ల క్రితమే రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి మహాభారత్ తీయబోతున్నాడనే టాక్ కూడా వచ్చింది. ఒక సిరీస్ లా నాలుగైదు సిినిమాలు తీస్తాడని బాలీవుడ్ వర్గాలు చెప్పుకున్నాయి. ఈ పీరియాడికల్ డ్రామాలో నటించేందుకు అమిర్ ధైర్యం చేయలేకపోతున్నాడు. భారీ బడ్జెట్ ను రికవరీ చేయగలమా అనే డౌట్ తో సినిమా పక్కన పెట్టేశాడు. 

 

కొన్ని పాఠాలు గెలుపు పాఠాలు నేర్పుతాయి. మరికొన్ని ఫ్లాపులు నిరాశలోకి నెడతాయి. అయితే ఈ పాఠాలు, నిరాశలు అన్నీ యంగ్ స్టర్స్ నే ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. సీనియర్ హీరోలు వాళ్ల అనుభవంతో అన్నింటిని ఒకేలా తీసుకుంటారు. కానీ షారుఖ్ ఖాన్ మాత్రం నష్టాల దెబ్బకు సినిమాలు పక్కన పెట్టి ఏడాది నుంచి లాక్ డౌన్ లో ఉంటున్నాడు.

షారుఖ్ ఖాన్ కెరీర్ లో బోల్డన్ని ఫ్లాపులు చూశాడు. అంతకుమించి విజయాలు అందుకున్నాడు. కానీ జీరో ఫ్లాప్ మాత్రం ఈ హీరోను చాలా ప్రభావితం చేసింది. సొంత బ్యానర్ లో తీసిిన ఈ సినిమా డిజాస్టర్ కావడంతో భారీగా నష్టపోయాడు. ఈ లాసుల దెబ్బకు మరో సినిమా మొదలుపెట్టకుండా.. హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: