రాజమౌళి ఎవరినీ అంత ఈజీగా వదిలిపెట్టడు. తనకు కావాల్సిన అవుట్ పుట్ వచ్చే వరకు హెడ్ మాస్టర్ లా చదివిస్తూనే ఉంటాడు. అందుకే జక్కన్న స్కూల్ కొంచెం కష్టమని చెబుతారు. ఈ మాస్టార్ గారు లాక్ డౌన్ లోనూ ఎవరినీ విడిచిపెట్టట్లేదట. టార్గెట్ రీచ్ అవ్వాలని ట్రిపుల్ ఆర్ టీమ్ ను పరుగులు పెట్టిస్తున్నాడట జక్కన్న. దీంతో ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ పైనా క్లారిటీ వస్తోంది. 


లాక్ డౌన్ తో ఇండస్ట్రీ మొత్తం మూతపడింది. షూటింగ్ లు, ప్రొడక్షన్ పనులు అన్నీ పక్కనపెట్టి ఇంటికే పరిమితమైంది. కానీ రాజమౌళి మాత్రం ఇంట్లో ఉన్నోళ్లతోనూ పనులు చేయిస్తున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ట్రిపుల్ ఆర్ గ్రాఫిక్స్ పనులు పూర్తి చేయిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ సెంథిల్, వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్ తో స్కైప్ లో ఇంటరాక్ట్ అవుతూ గ్రాఫిక్స్ పనులు చేయిస్తున్నాడు. వారంలో మూడు రోజులు ఈ పనిమీదే ఉంటున్నాడట జక్కన్న. 

 

ట్రిపుల్ ఆర్ సినిమా పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోంది. 1920ల కాలం నాటి కథ కాబట్టి, ఈ మూవీలో గ్రాఫిక్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇక కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ ఆగిపోయింది కాబట్టి.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇన్ టైమ్ లో కంప్లీట్ కావడం కష్టమనీ.. వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ రిలీజ్ అవడం సందేహమని కామెంట్ చేశారు ఇండస్ట్రీ జనాలు. 

 

ట్రిపుల్ ఆర్ గ్రాఫిక్స్ పనులేకాదు.. డబ్బింగ్ వర్క్ కూడా నడుస్తోందని చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు కంప్లీట్ అయిన పోర్షన్ కు తారక్, చరణ్ డబ్బింగ్ చెబుతున్నారని టాక్ వస్తోంది. ఇంట్లో రికార్డింగ్ థియేటర్ సెటప్ పెట్టారని డబ్బింగ్ కూడా పూర్తవుతోందని చెబుతున్నారు. మరి ఈ ప్లానింగ్ చూస్తోంటే రాజమౌళి ట్రిపుల్ ఆర్ ను వచ్చే ఏడాది జనవరికి రిలీజ్ చేసేలానే కనిపిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: