సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మొదలు పెట్టిన 'బీ ద రియల్ మ్యాన్' ఛాలెంజ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సందీప్ వంగా శ్రీకారం చుట్టిన ఈ ఛాలెంజ్‌ను ఇప్పుడు పలువురు స్వీకరించ‌డమే కాక త‌మ ఫ్రెండ్స్‌ కి కూడా విసురుతున్నారు. ఇంటి పనుల్లో భార్యకు సహాయం చేయడమే ఈ ఛాలెంజ్‌ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సందీప్ వంగా ఛాలెంజ్‌ని స్వీకరించిన రాజమౌళి ఈ ఛాలెంజ్‌ని పూర్తి చేసి రామ్‌చరణ్, ఎన్టీఆర్‌, కీరవాణి, శోభు యార్లగడ్డ, సుకుమార్‌ లను నామినేట్ చేసాడు. జక్కన్న ఛాలెంజ్‌ ని  స్వీకరించిన ఎన్టీఆర్ తన ఇంటి ఫ్లోర్‌ని క్లీన్ చేసి.. పాత్రలు కడిగేసి.. ఇంటి పరిసరాలని శుభ్రం చేసేశాడు. ఆ తరువాత ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, కింగ్ నాగ్, వెంకీ మామలతో పాటు దర్శకుడు కొరటాల శివకు ఛాలెంజ్ విసిరాడు. మెగాస్టార్ చిరంజీవి దోశె వేస్తే.. వెంక‌టేష్ మిక్స్‌డ్ వెజిటేబుల్ కర్రీ చేసేశారు.

 

ఇటీవల జక్కన్న విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన ఎన్టీఆర్ ఇంటి పనులు చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి అగ్ర కథానాయకులు చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ - బాలయ్యలను ఇంటి పనులు చేయాల్సిందిగా ఛాలెంజ్ విసిరాడు. ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన చిరు ఇప్పటికే ఇంటి పనులను చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. 'రోజూ చేసే పనే అయినా ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం' అంటూ పోస్ట్ చేసాడు. ఎన్టీఆర్ సవాలుని స్వీకరించిన విక్టరీ వెంకటేష్‌ ఈ మేరకు ఇంటి పనులు చేస్తూ వీడియో పోస్టు చేశాడు. గార్డెన్ లో మొక్కలు కట్ చేస్తూ.. మొక్కలకి నీళ్లు పెడుతూ బిజీగా గడిపాడు. అంతటితో ఆగకుండా కిచెన్‌ లోకి వెళ్లి కర్రీ కూడా చేసేసాడు. క్యారట్ ముక్కలు కట్ చేసి.. అందులో పన్నీర్ వేసి నోరూరించే విజిటెబుల్ కర్రీని రెడీ చేసాడు. వెంకటేష్ టాస్క్ పూర్తయ్యాక తాపీగా కూర్చొని బుక్ చదువుకున్నాడు. 'ఇదిగో నా వీడియో తారక్ అంటూ.. అందరూ ఇంట్లోవారికి డొమెస్టిక్ వర్క్ లో హెల్ప్ చేయండి' అని పిలుపునిచ్చాడు. అంతేకాకుండా ఈ ఛాలెంజ్ ను కొనసాగించాల్సిందిగా వెంకీ సిల్వర్ స్క్రీన్ బ్రదర్ మహేష్ బాబుని.. వెండితెర కోబ్రా (కో బ్రదర్) వరుణ్ తేజ్.. డైరెక్టర్ అనిల్ రావిపూడిలకు సవాలు విసిరాడు.

 

ఇప్పుడు తాజాగా జక్కన్న విసిరిన ఛాలెంజ్ ని నిర్మాత శోభు యార్లగడ్డ పూర్తి చేసాడు. ఇంటి పనులన్నీ చేస్తూ వీడియో తీసి ఇదిగో రాజమౌళి అంటూ సోషల్ మీడియాలో వదిలాడు. అంతేకాకుండా ఈ ఛాలెంజ్ ని స్వీకరించవలసిందిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అడవి శేష్.. అల్లు అర్జున్ లను నామినేట్ చేసాడు శోభు. మరి ఈ పరిస్థితులలో శోభు యార్లగడ్డ విసిరిన 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజ్‌ ని పూర్తి చేసి ప్రభాస్ 'రియల్ మ్యాన్' అనిపించుకుంటాడో లేదో అనేది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: