బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ లో భాగంగా  రెండు రోజుల క్రితం యంగ్ టైగర్ ,ఎన్టీఆర్ దగ్గర నుండి ఛాలెంజ్ ను స్వీకరించి దాని పూర్తి చేసి సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ను నామినేట్ చేశాడు స్టార్ డైరెక్టర్ శివ కొరటాల. ఇక ఈ ఛాలెంజ్ ను పూర్తి చేయలేదు కానీ దీనిపై స్పందించాడు విజయ్. శివ సర్ మాఇంట్లో మా అమ్మ నన్ను ఏం పనులు చేయనివ్వట్లే ..  పని డబుల్ అవుతుదంటా.. ఇంకా చిన్న పిల్లలాగే చూస్తుంది అయితే  లాక్ డౌన్ లో నా రోజు ఎలా గడుస్తుందో మీకు వీడియో ద్వారా చూపిస్తానని విజయ్ ట్విట్టర్ ద్వారా  తెలిపాడు. 
 
 
ఇక యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్ కు సూపర్ రెస్పాన్స్ ను వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే  రాజమౌళి, ఎన్టీఆర్ , రామ్ చరణ్ , కొరటాల శివ తదితరులు ఈ ఛాలెంజ్ ను పూర్తి చేయగా ఈరోజు చిరంజీవి ,వెంకటేష్ కూడా  ఈఛాలెంజ్ ను పూర్తి చేశారు. ఇక వెంకటేష్.. మహేష్ బాబు , వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి లను ఈ ఛాలెంజ్ కోసం నామినేట్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: