మెగాస్టార్ చిరంజీవి సోదరుడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మొదటగా1996లో హీరోగా పరిచయమైన సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. కాగా హీరోగా నటించిన తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్, ఆ తరువాత ఏడాది విశాఖపట్నానికి చెందిన నందిని రెడ్డిని వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమెతో కలిసి కొన్నాళ్ళు కాపురం చేసి ఆపై ఆమె నుండి దూరంగా ఉన్న పవన్, 1999లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రి సినిమాలో తన సరసన నటించిన రేణు దేశాయ్ ని ప్రేమించి ఆమెతో కలిసి కొన్నాళ్ళు సహజీవనం చేసారు. అనంతరం 2009లో రేణు దేశాయ్ ని అధికారికంగా తాళి కట్టి తన భార్యగా చేసుకున్న పవన్, ఆమెతో కొన్నాళ్లు కుటుంబ జీవితం కొనసాగించారు. 

IHG

ఆ తరువాత 2013లో జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన తీన్ మార్ సినిమాలో ఒక పాటలో నటించిన అన్న లెజెనోవా ని ప్రేమించి వివాహమాడారు పవన్. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో జరిగిన ఈ మూడు పెళ్లిళ్ల విషయమై ఇప్పటికీ చాలామందికి ఎన్నో అనుమానాలు, ఇక మరికొందరు అయితే అదే అలుసుగా తీసుకుని ఆయన మూడు పెళ్లిళ్ల జీవితంపై విమర్శలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే అక్కడక్కడా కొన్ని సందర్భాల్లో తన జీవితంలో జరిగిన ఈ పెళ్లిళ్ల విషయమై పవన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తిగత అభిప్రాయాలు అనేవి కొన్ని ఉంటాయని, అలానే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుందని, దానిని బట్టి అతడు నడుచుకుంటాడని అన్నారు. 

 

వాస్తవానికి తన పెళ్లిళ్ల గురించి ప్రస్తావించేవారికి తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఘటనలు గురించి తెలియదని, తెలిస్తే ఎవరూ ఈ విధంగా తనని అనరని కొంత ఆవేదనతో చెప్పడం జరిగింది. తనకు ఆడవారంటే ఎంతో గౌరవం ఉందని, అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్లనే తన జీవితంలో ఈ విధంగా మూడు పెళ్లిళ్లు చేసుకోవలసి వచ్చిందని, అన్ని విషయాలు విడమర్చి చెప్పడం ఎంతటి వ్యక్తికైనా కుదరని పని అని పవన్ చెప్పడం జరిగింది. అయితే పవన్ ఆవేదనలో నిజం ఉందని, ఎందుకంటే ఆయన వ్యక్తిగత జీవితంలో ఏమి జరిగింది అనేది ఎవరికి తెలియదు కాబట్టి, వాటి వలన తనకు కొంత ఇబ్బంది కలిగి ఉండడం వల్లనే ఆ విధంగా పెళ్లిళ్లు చేసుకుని ఉండవచ్చు కదా అని అంటున్న వారున్నారు.......!!!

మరింత సమాచారం తెలుసుకోండి: