యాంకర్ జాన్సీ.. ఈమె పేరు యాంకర్ అనే కంటే కూడా మంచి నటి అని చెప్తే ఎక్కువ మందికి గుర్తు ఉంటుంది. ఎన్నో సినిమాలలో.. అద్భుత నటిగా నటించిన జాన్సీ కెరీర్ ప్రారంభంలో ఓ మంచి యాంకర్.. ఆమెను చూసి అసూయా పడని యాంకర్ ఉండదు అనుకోండి.. మంచి మంచి పాత్రల్లో నటించి దుమ్ము దులిపింది. 

 

IHG

 

ఇంకా వెంకటేష్ చిత్రం తులసి లో కోకాపేట ఆంటీలా ఓ రేంజ్ లో నటిస్తే.. మొన్న వచ్చిన సోగ్గాడే చిన్నినాయనలో కూడా దుమ్ము దులిపింది. ఇంకా అలాంటి ఈ యాంకర్ జీవితంలో కూడా ఓ విషాదమైన కథ ఉంది. అదే ఆమె వైవాహిక జీవితం.. ఏంటి అది అందరి జీవితాల్లో ఓ మంచి జ్ఞాపకం కదా ఈమె జీవితంలో విషాదం ఏంటి అని అనుకుంటున్నారా? 

 

IHG

 

అక్కడికే వస్తున్న.. ఆమె భర్త జోగి నాయుడు.. ఇతను కూడా సినిమాలో హీరో కాకపోయినా.. మంచి మంచి పాత్రల్లో కనిపించి అందరిని మెప్పిస్తుంటాడు.. అలాంటి ఇతను.. జాన్సీ పెళ్లి చేసుకున్నారు.. ఈ జంటకు ఒక అద్భుతమైన పాప కూడా ఉంది.. మరి ఏమైందో తెలియదు కానీ.. ఆమెకు జోగి నాయుడుకు విడాకులు అయ్యాయి.. 

 

IHG

 

ఎవరి జీవితం వారు జీవిస్తున్నారు.. జోగి నాయుడు రెండో పెళ్లి చేసుకున్నాడు.. ఇంకా జాన్సీ పాపతో కలిసి ఒంటరిగా ఉంటుంది.. ఇంకా తెలిసిందే కదండీ.. సమాజం ఎలా ఉందో? జాన్సీకి తనకంటే చిన్నవాడైన అబ్బాయితో లింక్ పెట్టుకుంది అని సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతూనే ఉంది.. మరి ఆ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. అలా ప్రచారం అయితే జరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: