ఇప్పుడు కాలమంతా సోషల్ మీడియా మీద ఆధారపడుతుంది. జస్ట్ ఇమాజిన్.. సుప్రీం హీరో.. మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో వేసుకునే దోశ మనం చూస్తామని.. ఆయన ఇంటి పని చేస్తుంటే మనం చూడగలమని అనుకున్నామా.. సోషల్ ఫ్లాట్ ఫామ్ వచ్చాకా స్టార్స్ అందరు మన ఇంట్లో మెంబర్స్ గా మారిపోయారు. వాళ్ళు చేసే ప్రతి పని మనకు తెలిసిపోతుంది. ఈమధ్యనే మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. చిరుని స్వయంగా తన అప్డేట్స్ పెడుతుండటం విశేషం. 

 

ఇక చిరు ట్విట్టర్ లోకి వచ్చిన దగ్గర నుండి భలే సందడి మొదలైంది. ప్రతిరోజూ ఏదో ఒక ట్వీట్ తో సర్ ప్రయిజ్ చేస్తూనే ఉన్నాడు. లేటెస్ట్ గా తారక్ ఇచ్చిన బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ లో భాగంగా ఇంట్లో తాను చేసే పనులను షేర్ చేసి మెగా ఫ్యాన్స్ ను అలరించాడు చిరు. అయితే ఎన్టీఆర్ ఈ టాస్క్ లో భాగం అవ్వాలని బాబాయ్ నందమూరి బాలకృష్ణకు ఛాలెంజ్ చేశాడు. అయితే బాలకృష్ణ అటు సినిమాలతో ఇటు రాజకీయాలతో ఫుల్ బిజీ. ఆయన ఇంతవరకు ట్విట్టర్ అవసరం పడలేదు. 

 

కానీ స్టార్స్ అంతా తమ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ను అలరిస్తున్న ఈ సందర్భంలో బాలయ్య బాబు కూడా ఈ సోషల్ మీడియా ప్రపంచంలోకి వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్. అయితే ఇలాంటి వాటి మీద బాలకృష్ణకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే ఆయన లైట్ తీసుకున్నారు. ఇక ఛాలెంజ్ ల విషయానికి వస్తే కెమెరా ముందుకొచ్చి అలంటి పనులు చేస్తేనే రియల్ మ్యాన్ అయినట్టా అని ఫ్యాన్స్ ఇప్పటికే బాలయ్యకు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే బాలకృష్ణ కూడా ట్విట్టర్ లోకి వచ్చి కొత్త బంధాన్ని ఏర్పరచుకుంటే ఆ కిక్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: