ఇండియన్ సినిమాలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సైఫ్ అలీ ఖాన్. అతను బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్నాడు. దక్షిణాదిలో అతనికి పెద్దగా ఫాలోయింగ్ లేకపోయినా బాలీవుడ్ లో మాత్రం భారీగా అభిమానులు ఉన్నారు ఆయనకు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన సైఫ్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్తూ ఉంటారు. అవి ఏంటీ అంటే ఆయన వివాహం విషయం లోనే. ఆయనకు అమ్మాయిలు అంటే ఆసక్తి ఎక్కువగా ఉంటదని చెప్తూ ఉంటారు. 

 

ఈ క్రమంలోనే ఆయన రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారని కొంత మందితో సహజీవనం చేసారని అంటారు. ఇది పక్కన పెడితే... ముందు ఆయన అమ్రిత సింగ్ ని 1991 లో వివాహం చేసుకున్నారు. అక్కడి నుంచి 13 ఏళ్ళ పాటు వీరి బంధం కొనసాగింది. సారా అలీ ఖాన్ కూడా పుట్టింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు గాని ఇద్దరు విడిపోయారు. ఇక అక్కడి నుంచి కొందరు హీరోయిన్ లతో ఆయనకు ప్రేమ వ్యవహారాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. వారి కోసం అసలు భార్యను వదిలేసారు అనేది కూడా కొందరు పదే పదే చెప్పే మాట. వాస్తవాలు లేకపోయినా మీడియా పుకార్లు రాస్తూ ఉంటుంది. 

 

అందులో భాగంగానే ఆయన గురించి కొన్ని కథనాలు వచ్చాయి. ఇక 2012 లో ఆయన కరీనా కపూర్ ని వివాహ౦ చేసుకున్నారు. వీరికి కొడుకు కూడా పుట్టాడు. కొడుకు పేరు తైమూర్ అలీ ఖాన్. ఇక వీరి పెళ్లి గురించి బాలీవుడ్ లో అనేక చర్చలు జరిగాయి. ఆమెను అతను ఎత్తుకుని పెంచిన రోజులు ఉన్నాయని అలాంటి ఆమెను ఏ విధంగా పెళ్లి చేసుకుంటాడు అంటూ పలువురు అప్పట్లో ఎక్కువగా విమర్శలు కూడా చేసారు. అయినా సరే వెనక్కు తగ్గలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: