తెలుగు సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకునే జంట కృష్ణ విజయనిర్మల. వీరి బంధం గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు టాలీవుడ్ జనం. అప్పటికే ఇద్దరికీ పెళ్లి అయి పిల్లలు ఉన్నా సరే వీరు మాత్రం కలిసి జీవించాలి అనుకోవడం నిజంగా అప్పుడు చాలా మందికి షాకింగ్ విషయం. ఆమె తో కలిసి కృష్ణ చాలా సినిమాలు చేసారు. ఆ సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి అప్పట్లో. ఆమె నటిస్తుంది అది కృష్ణ సినిమా అంటే చాలా మంది అభిమానులు సినిమా చూడటానికి పనులు మానుకుని వెళ్ళిన సందర్భాలు కూడా అప్పట్లో ఉన్నాయి. 

 

కృష్ణ విజయనిర్మల బంధం గురించి ఇప్పటికి కూడా టాలీవుడ్ లో ఏదోక వార్త వస్తూనే ఉంటుంది. వీరిద్దరూ ప్రేమించి దగ్గర కావడం ఆ తర్వాత పిల్లలు వద్దు అనుకోవడం అన్నీ కూడా అప్పట్లో షాక్. పిల్లలను ఇద్దరూ ఒప్పించి దగ్గర చేసుకున్నారు. కృష్ణ కు అప్పటికే మహేష్ బాబు తల్లి తో వివాహం అయింది ముగ్గురు పిల్లలు పుట్టారు. విజయ నిర్మలకు అప్పటికే వివాహం అయింది నరేష్ పుట్టాడు. అయినా సరే వీళ్ళు వెనక్కు తగ్గలేదు. చాలా మంది వీరిని అప్పట్లో వ్యతిరేకించారని చెప్తారు. 

 

విజయ నిర్మలను బెదిరించారు అనే వాళ్ళు  కూడా ఉన్నారు. అయినా సరే ఆమె మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు, మహేష్ బాబు తల్లి తరుపున కొందరు ఆమెను బెదిరించారు అని అంటారు. కాని అది ఎంత వరకు నిజం అనేది ఎవరికి తెలియదు. కాని వీరు ఇద్దరు మాత్రం చివరి వరకు కలిసే ఉన్నారు. విజయ నిర్మల కృష్ణ ను ఏ సందర్భం లో కూడా వదిలిపెట్టలేదు. ఆయనకు అన్ని విధాలుగా ఆమె అండగా నిలబడటమే కాకుండా ఆయనకు తానే అన్నీ అయ్యారు. ఆ విధంగా ఈ బంధం కొనసాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: