కొరటాల శివ దర్శకత్వం ‘భరత్ అనే నేను’ విడుదలై రెండు సంవత్సరాలు గడిచినా కొరటాల నుండి మరో సినిమా ఇప్పటి వరకు విడుదలకాలేదు. ప్రస్తుత టాలీవుడ్ మార్కెట్ లో కొరటాలకు 15 కోట్ల వరకు పారితోషికం ఇవ్వడానికి అనేకమంది నిర్మాతలు ఆసక్తి కనపరిచినా కొరటాలకు చిరంజీవి పై ఉన్న మ్యానియాతో ‘ఆచార్య’ మూవీలో ఇరుక్కుపోయాడు. 


ఒక సంవత్సరం చిరంజీవి ‘సైరా’ విడుదలకోసం నిరీక్షణలో గడిచిపోతే ఈఏడాది కరోనా ఎఫెక్ట్ తో ‘ఆచార్య’ ఈసంవత్సరం విడుదల అవ్వడం కష్టమే అని అంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల వచ్చే ఏడాది సంక్రాంతి నుండి సమ్మర్ కు వాయిదా పడితే ‘ఆచార్య’ ను వచ్చేఏడాది సంక్రాంతికి అయినా విడుదలచేయాలని కొరటాల ఆశపడుతున్నాడు. 


అయితే కరోనా పరిస్థితుల పై ఎవరికీ ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో కొరటాల తీవ్ర నిరాశతో లాక్ డౌన్ లో గృహనిర్భందంలో ఉన్నప్పటికీ ఆనిరాశ నుండి తేరుకుని ప్రస్తుతం కొరటాల ఒక పవర్ ఫుల్ స్టోరీని చాల వేగంగా వ్రాస్తూ ఆకథకు సంబంధించిన టోటల్ స్క్రిప్ట్ ను పూర్తిచేసే పనిలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. దీనితో కొరటాల ఈకథను ఏ హీరో కోసం వ్రాసుకున్నాడు అంటూ ఈ లాక్ డౌన్ సమయంలో కూడ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి కొరటాలకు జూనియర్ తో అదేవిధంగా మహేష్ తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 


అయితే ప్రస్తుతం వీరిద్దరూ వేరే దర్శకుల సినిమాలకు కమిట్ అవ్వడంతో మరొక సంవత్సరం వరకు వీరిద్దరూ కొరటాలకు అందుబాటులో ఉండరు. దీనితో కొరటాల లేటెస్ట్ గా వ్రాస్తున్న ఈ కథ ఏ హీరోని దృష్టిలో పెట్టుకుని వ్రాస్తున్నారు అంటూ ఆలోచనలు చేస్తున్నవారికి ఊహించని లీక్ ఇప్పుడు బయటకు వచ్చింది. తెలుస్తున్న సమాచారంమేరకు కొరటాల ఈకథను విజయ్ దేవరకొండను దృష్టిలో పెట్టుకుని వ్రాస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు లాక్ డౌన్  ముగిసి తిరిగి షూటింగ్ లు మొదలు అయ్యాక విజయ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఫైటర్’ మూవీ షూటింగ్ ముగిసిన వెంటనే కొరటాలకు డేట్స్ ఇస్తాను అని చెప్పడంతో కొరటాల తన కెరియర్ కు సంబంధించి ఇప్పటి వరకు అనుకోకుండా జరిగిన డ్యామేజ్ కి పరిష్కారంగా ఇలా విజయ్ దేవరకొండ సినిమాను కూడ లైన్ లో పెడుతున్నాడు అని వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి..   

మరింత సమాచారం తెలుసుకోండి: