కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా పడిన రంగాల్లో సినీరంగం ఒకటి. సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఎన్నో సంక్షోభాలను విపత్తులను ఎదుర్కొన్నప్పటికీ ఇంతటి రేంజ్ లో ఎప్పుడు నష్టం చవి చూడలేదు. ట్రేడ్ వర్గాలు లెక్కించించడానికి వీల్లేని రేంజ్ కి ఈ కరోనా నష్టం చేరింది. ఈ సంక్షోభం నుండి సినీ ఇండస్ట్రీ బయటపడటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజురోజుకు కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో లాక్ డౌన్ పీరియడ్ ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మొదట 21 రోజులుగా ప్రకటించిన లాక్ డౌన్ ని వచ్చే నెల వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

 

ప్రస్తుత పరిస్థితులు చూస్తే కరోనా ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై వచ్చే ఏడాది వరకు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. మే నుండి అయినా షూటింగ్స్ మొదలవుతాయని నమ్మకంతో ఉన్న దర్శక నిర్మాతలకు పరిస్థితులను చూస్తుంటే అది జరిగేలా లేదు. దీనితో కొందరు ప్రత్యేక అనుమతులతో సెట్స్ లో ఇండోర్ షూటింగ్స్ జరుపుకోవడం బెటర్ అని భావిస్తున్నారట. అలాగే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'ఆచార్య' టీమ్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ముంబైలో ఉన్న నేపథ్యంలో ఆమె హైదరాబాద్ లో షూట్ కి హాజరు కావడం కష్టం.

 

ఈ నేపథ్యంలో ప్రస్తుతాని ఆమె లేని సన్నివేశాలు చిత్రీకరించాలని దర్శకుడు కొరటాల భావిస్తున్నారట. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక కాజల్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరిపే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆచ్యార టీమ్ ప్లాన్ ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని కొణెదల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామ్ చరణ్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: