పవన్ కళ్యాణ్ ఇంటిలో లక్ష పుస్తకాలతో కూడిన లైబ్రరీ ఉంది అని అంటారు. పవన్ సేకరించిన పుస్తకాలు కొన్ని ప్రముఖ గ్రంధాలయాలలో కూడ దొరకవు అంటూ అనేకమంది చెపుతూ ఉంటారు. పుస్తకాలు అంటే విపరీతమైన ఆసక్తి ఉన్న పవన్ కు నిన్నటిరోజు తనకు చాల ఆనందంగా గడిచింది అని అంటున్నాడు.


దీనికి కారణం నిన్న ప్రపంచ పుస్తక దినోత్సవం. కరోనా వార్తలు మినహా మరే వార్తలు జనం పట్టించుకోని పరిస్థితులలో పవన్ పుస్తకాల ప్రాముఖ్యంత గురించి తెలియచేస్తూ ఈ లాక్ డౌన్ సమయంలో ఎవరు బయటకు రాకుండా పుస్తకాలు చదువుతూ కాలం గడపమని పిలుపును ఇచ్చాడు. 


పవన్ పిలుపుకు అతడి వీరాభిమానుల నుండి కూడ పెద్దగా స్పందన రాకపోవడంతో జనం అంతా కరోనా వార్తలకు ఎలా అంకితం అవుతున్నారో అర్ధం అవుతుంది. శ్రీ‌శ్రీ‌ గుంటూరు శేషేంద్ర‌శ‌ర్మ‌ నారాయ‌ణ‌రెడ్డి గ‌ద్ద‌ర్ లాంటి ప్రముఖ కవుల కవితలను ఇష్టపడే పవన్ తన ఉపన్యాసాలలో తరుచు బాలగంగాధర తిలక్ సాహిత్యాన్ని తరుచు ప్రస్తావిస్తూ ఉంటాడు ఇది అంతా పవన్ వ్యక్తిత్వంలోని సాహితీ కోణం.


ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలు కరోనా తో యుద్ధం చేస్తున్న పరిస్థితులలో హైదరాబాద్ లోని తన ఇంటిలో తన స్వీయ గృహనిర్భందంలో ఉన్న పవన్ జనసైనికులు ఆంధ్రప్రదేశ్ లోని అనేకచోట్ల ఈ కరోనా కాలంలో చేస్తున్న అనేక సేవా కార్యక్రమాల గురించి మాట్లాడకుండా ఇప్పుడు పుస్తకాల ప్రాముఖ్యత గురించి చెప్పడం అతడి వీరాభిమానులను కూడ ఆశ్చర్య పరుస్తోంది. ప్రస్తుతం భాగ్యనగరం నుండి తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సహాయ కార్యక్రమాల గురించి మాట్లాడకుండా ఆకలితో అలమటిస్తున్న వలస కూలీల సమస్య పై శ్రద్ధ పట్టకుండా ఇప్పుడు పుస్తకాల గురించి మాట్లాడటం అవసరమా అంటూ మరి కొందరి కామెంట్స్. 


అయితే ఏ విషయం పై అయినా మౌనమే తన సమాధానంగా భావించే పవన్ తన పుస్తక పఠనంతో బిజీగా గడిపేస్తున్నాడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: