హీరోల మధ్య.. సినిమా మధ్య పోటీ ఉండడం సహజం. కానీ ఆ పోటీని కూడా స్నేహపూర్వకంగా మార్చుకున్న ఘనత టాలీవుడ్ కు చెందుతుంది. అలాంటి పోటీ ఆరోగ్యకరంగానే ఉంటుంది. ఆ పోటీలో తట్టుకుని నిలబడేందుకు హీరోలు గట్టిగానే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వారి అభిమానులు మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు. తమ హీరో నంబర్ వన్ అని కాలర్ ఎగరేస్తూ ఉంటారు. స్టార్ హీరోలలో ఎవరు ఫస్ట్ అనే లెక్కలు ఎప్పుడూ ఫ్యాన్స్ కి కిక్కిస్తాయి. వీటి కోసం హీరోల ఫ్యాన్స్ గొడవలు పడుతూ ఉంటారు. ఓ హీరోకి దక్కిన విజయాలు.. కలెక్షన్స్ లెక్కల ఆధారంగా ఈ ప్లేసులు.. పోసిషన్ లు.. ఆయన స్టార్ డమ్ నిర్ణయిస్తారు. ఈ నెంబర్ గేమింగ్ గురించి మన టాలీవుడ్ లో చెప్పక్కర్లేదు.

 

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఏర్పడినప్పటి నుండి ఏ హీరో నెంబర్ వన్ అనే టాపిక్ మీద చర్చలు జరుగుతూనే వస్తున్నాయి. ఇకపై వస్తూనే ఉంటాయి కూడా. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కి చెందిన ఓ మీడియా సంస్థ అక్కడ హీరోల స్టార్ డమ్ ఫాలోయింగ్ లెక్కలు కట్టి హీరోల పొజిషన్ నిర్ణయిస్తుంది. ఒర్మాక్స్ మీడియా అనే ఈ సంస్థ ఈ మధ్య టాలీవుడ్ మరియు కోలీవుడ్ పరిశ్రమలలో కూడా ఈ ట్రాకింగ్ మొదలుపెట్టింది. ఆ మీడియా సంస్థ సర్వే మరియు ట్రాకింగ్ ప్రకారం టాలీవుడ్ లో కూడా హీరోలకు రేటింగ్ ఇచ్చారు. దాని ప్రకారం టాలీవుడ్ లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచారు. మిగతా స్టార్ హీరోలందరితో పోల్చుకుంటే మహేష్ అత్యధిక పాయింట్స్ సాధించి ఫస్ట్ ప్లేస్ సాధించినట్లు సదరు మీడియా సంస్థ వారు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

 

అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఆయన తరువాత స్థానాలు ఆక్రమించారు. ఒర్మాక్స్ ఈ మార్చి వరకు ప్రామాణికంగా తీసుకొని చేసిన సర్వేలో సూపర్ స్టార్ మహేష్ ఫస్ట్ ప్లేస్ ఆక్రమించగా.. అల్లు అర్జున్, ప్రభాస్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ నాలుగు మరియు ఎన్టీఆర్ ఐదో స్థానంలో నిలిచారు. ఈ ఐదుగురు హీరోలు టాప్ ఫైవ్ స్థానాల్లో నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నాని, విజయ్ దేవరకొండ, వెంకటేష్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. మా హీరో ఫస్ట్ మా హీరో ఫస్ట్ అని గొడవలు పడే అభిమానులకు ఇలాంటి సర్వేలు కొంచెం రుచించకపోవచ్చు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: