ప్రస్థుత కాలమాన పరిస్థితులలో ఏ వ్యక్తికి అయినా ప్రధానంగా కరోనా భయం తప్ప మరే భయం వెంటాడటం లేదు. తెల్లవారితే చాలు కూరగాయలు పండ్లు నిత్యావసరాలు మందులు ఉంటే చాలు ఏమీ లేకపోయిన వాటి గురించి పట్టించుకోవడం మనిషి మర్చిపోయాడు. 


కరోనా కు ముందు కాలంలో ప్రజలకు డబ్బు మాత్రమే ఊపిరి. ఇప్పుడు ఆ కరెన్సీ నోట్లను చూసి జనం భయంతో కాలం గడుపుతున్నారు. కాగితం పై కూడ ‘కరోనా క్రిమి’ కొన్ని గంటల పాటు సజీవంగా ఉంటుంది అని వస్తున్న వార్తలు చూసి ప్రస్తుతం జనం ఊపిరి అని భావించిన కరెన్సీ నోట్లను టచ్ చేయడానికి కూడ భయపడిపోతున్నారు. 


దీనితో ప్రస్తుతం జనం ఎక్కువ మంది ప్రధాని మోడీ కోరిన నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా చేస్తున్నారని ఇప్పుడు ఈ నగదు రహిత లావాదేవీలు 70 శాతానికి చేరువలో ఉన్నాయని పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా తన లేటెస్ట్ రిపోర్ట్ లో వెల్లడించింది. దీనితో చిన్నచిన్న కూరగాయాల దుకాణాలు కిరాణా షాపులు మిల్క్ బూత్ లు మెడికల్ షాపులు ఇలా ఎక్కడ చూసినా నగదు రహిత లావాదేవీలకే ప్రాముఖ్యత పెరిగింది. 


ఈ డిజిటల్ పేమెంట్స్ పుణ్యమా అని ఏటీఎం సెంటర్స్ జనం లేక బోసిపోతూ ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ‘సర్వాంతర్యామి భగవంతుడు కాదు ఆయన స్థానాన్ని డామినేట్ చేస్తోంది మొబైల్’. లాక్ డౌన్ తో ప్రజలకు పనిలేక సమయం ఎక్కువగా దొరకడంతో మంచి పనులు చేయడం మానేసి గంటలు గంటలు కాలాన్ని వృథాగా గడుపుతూ మొబైల్ లో పనికిరాని మెసేజ్ లు ఛాటింగ్ లతో పనికిరాని విషయాలతో కాలం గడిపేస్తున్నారు. నేటితో లాక్ డౌన్ కు నెల రోజులు పూర్తి అయిన పరిస్థితులలో అస్తవ్యస్తంగా మారిన జనజీవనం ఎప్పటికి గాడిలో పడుతుందో తెలియక ఎటువంటి అవసరాలకు డబ్బు అవసరంలేదని భవిష్యత్ లో కూడ డబ్బు అవసరం ఉండవని ఊహలలో బ్రతికేస్తూ కరోనా ను ఏకంగా దేవత గా మార్చి పూజలు కూడ చేస్తూ ఆ మహమ్మారిని శాంతించమని అభ్యర్ధిస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: