భారతీయ సినీ పరిశ్రమలో బిగ్ బీ అమితాబచ్చన్ అంటే ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.  ఒకప్పుడు బాలీవుడ్ లో ఆయన సినిమాలంటే ప్రాణాలు ఇచ్చేవారు.. దేశ వ్యాప్తంగా అమితాబ్ కి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు బాలీవుడ్ కే పరిమితం అయిన ఆయన ఈ మద్య ఇతర భాషల్లో కూడా నటిస్తున్నారు.  ఆ మద్య నాగార్జున నటించిన మనం సినిమాలో కనిపించాడు. తర్వాత ఫుల్ లెన్స్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింమారెడ్డి’ మూవీలో ఆయన గురువుగా నటించారు. కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెరపై కూడా ఆయన తన సత్తా చాటుతున్నారు. ఆ మద్య కౌన్ బనేగా కరోడ్ పతితో యావత్ దేశాన్ని తన వైపు తిప్పుుకున్నారు బిగ్ బీ.

 

 లాక్ డౌన్ నేపథ్యంలో ఆయన లక్షమందిని నిరుపేదలను ఆదుకునేందుకు సిద్దమయ్యారు. అంతే కాదు టాలీవుడ్ లో సీసీసీ కి కూడా విరాళం ఇచ్చారు.  తాజాగా బిగ్ బీ ప్రేక్షకులకు ఓ పజిల్ వదిలారు. ఈ పజిల్ ఈనాటిది కాదు. చాలా రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతున్నదే. ఈ చిత్రంలో ఉన్న పెద్ద పులుల సంఖ్య ఎంత? అన్నదే ప్రశ్న. చాలా మంది దీనికి సమాధానం కోసం జుట్టు పీక్కోవాల్సి వుంటుంది.చిత్రంలో నాలుగు పెద్దపులులు వెంటనే కనిపిస్తాయి. కాస్తంతా జాగ్రత్తగా చూస్తే, మరో నాలుగు కనిపిస్తాయి.. ఇక మరిన్ని అంతర్లీణంగా ఉన్న వాటి గురించి చెప్పడం కష్టం అంటున్నారు.

 

ట్విట్టర్ లో దీన్ని చూసిన బాలీవుడ్ బిగ్ బీ, అమితాబ్ బచ్చన్, సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆన్సర్ ఇస్తూ, తనకు 11 టైగర్స్ కనిపించాయని చెప్పారు.  ప్రాచీ దేశాయ్  కూడా అదే సమాధానం ఇవ్వగా, అజయ్ సింగ్ తనకు 18 పులులు కనిపించాయని సమాధానం ఇచ్చారు. మరికొందరు 20 కనిపిస్తున్నాయని అనడం గమనార్హం.ఇక నటి దియా మీర్జా తనకు ఏకంగా 11 పులులు కనిపిస్తున్నాయని సమాధానం పెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: