భారతీయ సినిమాలో శ్రీదేవి అనే పేరు ఒక బ్రాండ్ అనే సంగతి అందరికి తెలిసిందే. హీరోయిన్ అనే పేరుకి ఆమె సార్ధకత చేకూర్చింది. ఏ స్టార్ హీరోకి రాని గుర్తింపు ని ఆమె రోజుల వ్యవధిలో సంపాదించుకుంది. సిని పరిశ్రమలో శ్రీదేవి అనేది ఇప్ప్పటికి ఒక బ్రాండ్. ఆ పేరు వింటే చాలు చాలా మంది అలా చూస్తుండిపోయే వారు. ఆ విధంగా ఆమె అభిమానులను సంపాదించుకుంది. భారతీయ సినిమాలో శ్రీదేవి ముందు శ్రీదేవి తర్వాత అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా శ్రీదేవి ఆకట్టుకుంది. అయితే ఆమె జీవితం మాత్రం విషాదంగా ముగిసిపోయింది అనేది వాస్తవం. 

 

ఎన్నో విజయాలు జీవితంలో సాధించినా సరే వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమె నిలబడలేదు. అనుకున్న లక్ష్యాలు సాధించిన ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇబ్బంది పడింది అనేది వాస్తవం. ఆమె ఎప్పుడు అయితే బోని కపూర్ ని ప్రేమించి వివాహం చేసుకుందో అప్పటి నుంచే ఆమె కెరీర్ నాశనం అవ్వకపోయినా వ్యక్తిగత జీవితం మాత్రం నాశనం అయింది అని చెప్పే వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి ఆమె జీవితంలో అన్నీ కోల్పోయింది అని కేవలం పిల్లలు భర్త కోసం మాత్రమే ఆమె బ్రతికింది అని చెప్తారు. ఆయనకు అప్పటికే వివాహం జరిగింది. 

 

పిల్లలు ఉన్నారు.. అయినా సరే ఆమె బోని కపూర్ ని వివాహం చేసుకున్నారు. ఎంత మంది వద్దని చెప్పినా సరే ఆమె మాత్రం వెనకడుగు వేసిన సందర్భం అనేది లేదు. ఆమె కెరీర్ కి ఆయన ఉపయోగపడలేదు. సొంత ప్రతిభ తో మాత్రమే శ్రీదేవి స్టార్ హీరోయిన్ అయింది గాని ఆయన సహకారం మాత్రం కచ్చితంగా కాదు. అయినా సరే ఆయన వలన శ్రీదేవి పైకి వచ్చింది అనే వాళ్ళు కూడా ఉండే వారు అప్పట్లో.

మరింత సమాచారం తెలుసుకోండి: