ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది.  రాజ పేద అనే తేడా లేదు ఈ కరోనా మహమ్మారికి అందరినీ భయపెడుతుంది.  చిన్న దేశం నుంచి అగ్ర రాజ్యమైన అమెరికా సైతం అతలాకుతలం అవుతుంది.  కరోనా భూతానికి లక్ష ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.. లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి.  ఇక మన దేశంలో లాక్ డౌన్ నేపథ్యంలో సినీ పరిశ్రమ మూత పడింది.  సెలబ్రెటీలు ఇంటిపట్టున ఉంటున్నారు. తాజాగా హృద‌య కాలేయం చిత్రంతో బ‌ర్నింగ్ స్టార్‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాడు సంపూర్ణేష్ బాబు. మంచి మానవ‌తా దృక్ప‌థం ఉన్న సంపూ సంక్ష‌భంలో త‌న వంతు సాయం చేయ‌డానికి ఎల్ల‌ప్పుడు ముందుంటారు.

 

ఈ మద్య  కరోనా క్రైసిస్‌ చారిటీ సంపూ రూ. లక్ష రూపాయలు విరాళం అందించారు. అంతే కాదు ఆ మద్య ఏపిలో ప్రకృతి విలయతాండం  చేస్తున్న సమయంలోకూడా తన వంతు విరాళం ఇచ్చాడు.  తాజాగా లాక్‌డౌన్ వ‌ల‌న ప్ర‌స్తుతం ఇంటికే ప‌రిమిత‌మైన సంపూర్ణేష్ బాబు భార్య‌, పిల్ల‌ల కోసం కంసాలిగా మారి బీ ది రియ‌ల్ మ్యాన్ అని నిరూపించాడు. స్వతహాగా "కంసాలి"వృత్తిలో కొనసాగిన సంపూర్ణేష్ బాబు చిత్ర పరిశ్రమలో రాణించాలి ఆ దిశగా పయణం మొదలు పెట్టాడు.  హీరోగా, కమెడియన్ గా మంచి సక్సెస్ సాధించాడు.

 

ఆ మద్య సంపూ నటించిన కొబ్బరి మట్ట మంచి సక్సెస్ అయ్యింది.  ఇంట్లో మిగిలి పోయిన గజ్జెలతో తన భార్య, పిల్లల కోసం.. మెట్టెలు, గజ్జెలు స్వయంగా చేసిన‌ట్టు పేర్కొన్నాడు. ఈ సందర్భంగా రాజు పేద తేడా లేదు...నీ ఆస్తి, డబ్బు నీ వెనక రావు.. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అని నా నిజమైన స్థానం గుర్తు చేసుకుంటూ,  మా ఆవిడ కోసం, నా పాత "కంసాలి"వృత్తి ని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేయించి ఇచ్చాను అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: