రాఘవ లారెన్స్ హీరోగా నటించిన కామెడీ హారర్ నేపథ్యంలో తెరకెక్కిన శివలింగ సినిమా లో ప్రధాన పాత్రలో నటించిన నటీమణి ఊర్వశి గురించి చాలా తక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు తెలుసు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె ఎక్కువగా తమిళ మలయాళ సినిమాల్లో మాత్రమే నటించింది. అడపాదడపా 'మనమంతా' లాంటి ఆమె సినిమాలు కొన్ని తెలుగులోకి అనువదించినప్పుడు మనం ఊర్వశి గురించి తెలుసుకున్నాం. ఈ ఆర్టికల్ ద్వారా ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాం.


ఊర్వశి అసలు పేరు కవిత రంజిని. 1970 లో కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది. 1980-90 సంవత్సరాల మధ్య మలయాళం తమిళ సినిమాలలోని ప్రధాన పాత్రలలో నటించి ఆయా భాషా ప్రేక్షకులను ఎంతో మెప్పించింది. ఆమె మూడు సినిమాలకు స్క్రిప్టు రాసి ఒక సినిమాని ఏకంగా నిర్మించింది. అచువిన్టే అమ్మ (2005) సినిమాలో నటించినందుకు గాను ఆమెకు ఉత్తమ సహాయనటి గా నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకుంది. అలాగే ఆమె ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును ఐదుసార్లు గెలుచుకుంది. ఇందులో 1989 నుండి 1991 వరకు వరుసగా మూడు విజయాలు ఉన్నాయి. తమిళనాడు ఫిలిం అవార్డ్స్ లలో కూడా ఊర్వశి రెండు ఉత్తమ నటి అవార్డులను గెలుచుకుంది.


ఊర్వశి సినీ కెరీర్ సాఫీగా సాగిపోయినప్పటికీ... ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ముఖ్యంగా తన మొదటి వివాహం ఫెయిల్ అయ్యింది. 2000వ సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన ఊర్వశి నటుడైనా మనోజ్ కే జయన్ ను పెళ్లి చేసుకుని 2001వ సంవత్సరంలో ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2008వ సంవత్సరంలో వారిరువురి మధ్య తీవ్రమైన మనస్పర్థలు ఏర్పడడంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. దాంతో అందరూ ఊర్వశి ఇంకెవరిని పెళ్లి చేసుకోకుండా తన పాపని పెంచి పెద్ద చేస్తుందని భావించారు. కానీ ఆమె మాత్రం 2013వ సంవత్సరంలో చెన్నైకు చెందిన శివప్రసాద్ అనే ఓ బిల్డర్ ని మ్యారేజ్ చేసుకుని 2014వ సంవత్సరంలో ఓ బాబుకి జన్మనిచ్చింది. ఆ బాబు పేరు ఇషాంత్ ప్రజాపతి అనే పేరు కూడా పెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: