ప్రేమ, పెళ్లి అనే పదానికి అర్థాలు మారిపోతున్న రోజులు ఇవి. ఎవరితో ఎప్పుడు ఎలా ప్రేమలో పడతారో తెలియదు.. ఎలా విడిపోతారో కూడా తెలియదు. ముఖ్యంగా సినిమా ఇండ‌స్ట్రీలో ప్రేమించి, పెళ్లి చేసుకుని‌.. ఆ త‌ర్వాత విడాకులు తీసుకుని మ‌ళ్లీ పెళ్లి చేసుకున్న వారు ఎంద‌రో ఉన్నారు. ప్ర‌స్తుతం ఒకసారి ప్రేమ పెళ్లి విషయంలో ఓడిపోయామని ఎవరు ఖాళీగా బాధపడుతూ దేవ‌దాసులాగా కూర్చోవడం లేదు. ఫటా ఫట్ గా మళ్ళీ ప్రేమలో పడిపోతున్నారు, పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా ఒక‌రు.

 

19 ఏళ్ల శ్రీ‌జ తాను ప్రేమించిన శిరీష్ భరద్వాజ్‌ను పెళ్ళి చేసుకోవ‌డానికి చాలా సాహ‌సాలే చేసింది. అప్ప‌ట్లో మీడియా కూడా వాళ్ల‌కే స‌పోర్ట్ చేసింది. ఇక ఇంట్లో నుంచి వెళ్లి మ‌రి పెళ్లి చేసుకున్న శ్రీజ‌.. అప్ప‌ట్లో చిరంజీవి,ప‌వ‌న్‌లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా.. బాబాయ్ ప‌వ‌న్ నుంచి త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని చెప్పి సంచ‌ల‌నానికి తెర లేపింది. దాదాపు ప‌దేళ్ల కింద శ్రీజ విష‌యంలో జ‌రిగిన ర‌చ్చ అంత త్వ‌ర‌గా ఎవ‌రూ మ‌రిచిపోలేరు. అయితే కొన్నాళ్ల పాటు వారి సంసార జీవితం సాఫీగానే సాగింది. కానీ, ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు రావ‌డంతో శిరీష్ భరద్వాజ్ నుంచి కొన్నేళ్ల కిందట విడాకులు తీసుకుంది చిరు చిన్న కూతురు. 

 

వీరిద్ద‌రి ఒక కూతురు కూడా ఉంది. ఇక విడిపోయిన త‌ర్వాత ప్రముఖ వ్యాపార వేత్త తనయుడు కళ్యాణ్ దేవ్‌ని శ్రీ‌జ  ఇష్ట‌పూర్వ‌కంగా 2016లో పెళ్ళి చేసుకుంది. మ‌రియు శ్రీజ, కళ్యాణ్ క్లాస్‌మేట్స్ కూడా. తన గురించి అన్ని తెలిసిన కళ్యాణ్‌ను పెళ్లాడేందుకు శ్రీజ సముఖంగా ఉండటంతో ఇరు కుటుంబాల వారు బెంగుళూరులోని చిరంజీవి ఫామ్ హౌస్ లో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. దీనికి ఇండ‌స్ట్రీ నుంచే కాకుండా రాజ‌కీయ రంగ ప్ర‌ముఖులు కూడా వ‌చ్చారు. ప్ర‌స్తుతం శ్రీ‌జ‌, క‌ళ్యాణ్ దేవ్ ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఇక‌ శ్రీ‌జ‌ మాజీ భర్త శిరీష్ భ‌ర‌ద్వాజ్ ఎక్క‌డున్నాడు అనే విష‌యంపై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ అంత క్లారిటీ లేదు. అయితే ఇటీవ‌ల ఆయ‌న కూడా రెండో పెళ్లి చేసుకున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: