లవ్ బ్రేకప్ తర్వాత శృతిహాసన్ గాడిలో పడింది. ప్రస్తుతం క్రాక్ మూవీలో రవితేజతో నటిస్తున్న ఈ బ్యూటీ.. త్వరలో  ఓస్టార్ తో జత కడుతోంది. ఇదే నిజమైతే.. ఆ హీరోతో నటించడం ఇది రెండోసారి అవుతుంది. ఇంతకీ శృతికి ఛాన్స్ ఇచ్చిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.. 


రెండేళ్ల క్రితం శృతిహాసన్ ప్రేమలో పడి ఛాన్సులకు దూరమైంది. అటు ప్రియుడా.. ఇటు కెరీరా.. అంటూ ఊగిసలాడిన శృతిహాసన్ మళ్లీ కెరీర్ పై దృష్టి పెట్టింది. బ్రేకప్ తర్వాత రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. తెలుగులో ఎవరూ పట్టించుకోలేదు. లవ్ బ్రేకప్ తర్వాత శృతిహాసన్ తెలుగులో కంటే ముందుగా తమిళంలో బంపర్ ఆఫర్ కొట్టేసింది. లాభం అనే తమిళ చిత్రంలో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తోంది. 


తెలుగులో ఆఫర్స్ రావడం కాస్త లేటైనా.. ఎట్టకేలకు క్రాక్ మూవీలో రవితేజతో నటించే అవకాశం అందుకుంది శృతి. బలుపు హిట్ తర్వాత రవితేజ, శృతితో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇది. 

 

కొత్త అందాల రాకతో.. శృతిహాసన్ కు గతంలో మాదిరి ఆఫర్స్ వెల్లువెత్తకపోయినా.. ఆమెతో ఒకసారి నటించిన హీరోలే మళ్లీమళ్లీ ఛాన్సులిస్తున్నారు. వకీల్ సాబ్ లో గెస్ట్ రోల్ ఆఫర్ వచ్చిందన్న న్యూస్ వచ్చినా.. గాసిప్సే అని తేలిపోయింది. లేదంటే.. గబ్బర్ సింగ్.. కాటమరాయుడు తర్వాత పవన్, శృతి కాంబోలో మూడో సినిమా అయ్యేది. 

 

శృతి ప్రేమలో ఉన్న సమయంలో.. యాక్టింగ్ కాదు.. ఫోటో షూట్స్ కు కూడా దూరంగా ఉంది.  బ్రేకప్ తర్వాత ముందుగా.. కెమెరాకు గ్లామర్ గా ఫోజులిచ్చి.. అందరి దృష్టిలో పడింది. మళ్లీ నటించేందుకు రెడీ అంటూ.. ఫోటో షూట్స్ తో మెసేజ్ పంపి.. తెలుగు, తమిళంలో ఆఫర్స్ అందుకుంది శృతి హాసన్. 

 

గతంలో మందుకు బానిస అయ్యానని.. యోగా.. ప్రాణాయామంతో పూర్తిగా మానేశానని.. శృతిహాసన్ చెప్పడం ఆమెకు ప్లస్ అయింది. ఇక శృతిహాసన్ ను తీసుకోవచ్చన్న నిర్ణయానికి హీరోలు.. దర్శకులు వచ్చినట్టున్నారు. త్రివిక్రమ్ సినిమాలో తారక్ హీరోయిన్ గా శృతి పేరు వినిపిస్తోంది. 

 

ఎన్టీఆర్, శృతిహాసన్ కాంబినేషన్ లో రామయ్యా వస్తావయ్యా సినిమా వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నిరాశపరిచింది. అయితే తారక్, శృతి మధ్య కెమిస్ట్రీ పండింది. ఇప్పుడీ కాంబినేషన్ రిపీట్ అంటూ వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: