టాలీవుడ్ లో మార్కెట్ పెరిగిన నేపధ్యంలో హీరోలు ఇప్పుడు మార్కెట్ ని పెంచుకోవడానికి గానూ కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అగ్ర హీరో అయినా చిన్న హీరో అయినా సరే ఇప్పుడు టాలీవుడ్ లో మార్కెట్ మీద కన్నేశారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. చిన చిన్న హీరోలు కూడా మార్కెట్ మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక కాంబినేషన్ రెడీ అవుతుంది అనే టాక్ వినపడుతుంది. అక్కినేని ఫ్యామిలీ తో సినిమా చేయడానికి ప్రభాస్ ముందుకి వచ్చాడు అని అంటున్నారు. 

 

అది ఎంత వరకు నిజం అనేది ఎవరికి తెలియదు గాని ఇప్పుడు ఒక సినిమా మాత్రం వీరి కాంబినేషన్ లో రావడానికి సిద్దమైంది అంటున్నారు. కథ కూడా ఇప్పటికే ఒక దర్శకుడు వినిపించాడు అని కమర్షియల్ కోణం లో ఈ సినిమా ఉంటుంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ సినిమా కథను నాగార్జున ఫైనల్ చేసారని సమాచారం. ఆయనకు కథ బాగా నచ్చడం తో ఈ సినిమాను ముందుకి తీసుకుని వెళ్ళాలి అని భావించారు ప్రస్తుతం ప్రభాస్ అఖిల్ ఒక్కో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత మరో సినిమా చేయడానికి వీరు రెడీ అయ్యారు. 

 

ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ కి మంచి డిమాండ్ ఉంది. వచ్చే ఏడాది అతను సినిమాలను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ఏడాది మొత్తం అతను దాదాపుగా సినిమా విడుదల చేసే అవకాశం లేదు. ప్రభాస్ తో సినిమా చేస్తే మార్కెట్ పరంగా తనకు కలిసి వస్తుంది అనే భావన లో అఖిల్ కూడా ఉన్నాడు అనేది టాలీవుడ్ జనాల మాట. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: