వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో కథ, కథనం పెద్దగా లేకపోయినా త్రివిక్రమ్ మాటలు ఎన్నో సినిమాలను నిలబెట్టాయి. ఇప్పటికీ బుల్లితెరపై త్రివిక్రమ్ సినిమాలకు మంచి టీఆర్పీ రేటింగ్స్ నమోదవుతూ ఉంటాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన అతడు సినిమా ఎన్నిసార్లు టెలికాస్ట్ చేసినా బుల్లితెర ప్రేక్షకులకు బోర్ కొట్టడం లేదు. 
 
సినిమా ఇప్పటికీ ఓ రేంజ్ టీఆర్పీలను సాధిస్తూ ఛానెల్ కు లాభాలను తెచ్చిపెడుతోంది. త్రివిక్రమ్ గొప్ప డైరెక్టరే... ఆయన సినిమాల్లో మాటలు అద్భుతంగా ఉంటాయి. కానీ ఆయనపై కొన్ని విమర్శలు ఉన్నాయి. ఆయన సినిమా కథలు ఏదో ఒక సినిమా నుంచి కాపీ చేస్తాడని... సినిమాలోని కొన్ని సీన్లను కూడా కాపీ కొడతాడని విమర్శలున్నాయి. ఈ విమర్శలను నిజం చేస్తూ యూట్యూబ్ లో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.  
 
త్రివిక్రమ్ కెరీర్ మొదట్లో కొన్ని సినిమాలకు కథ, మాటలు అందించారు. త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన చిరునవ్వుతో సినిమాలోని కొన్ని సీన్లు 1997లో వచ్చిన లా వెటా ఈ బిల్లా నుంచి కాపీ కొట్టారని ఆరోపణలున్నాయి. చిరునవ్వుతో సినిమాలో త్రివిక్రమ్ కొన్ని సీన్లను యాజ్ ఇట్ ఈజ్ గా దించేయడం గమనార్హం. జులాయి సినిమాలో అల్లు అర్జున్ విలన్ ను చేజ్ చేసే సీన్ ను లాతేల్ వెపన్ 4 సినిమా నుంచి ఎత్తేశారు. 
 
ఖలేజా మూవీలో ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ ప్లాస్టిక్ గురించి చెప్పే సీన్ ను ఏడు దశాబ్దాల క్రితం హాలీవుడ్ లో రిలీజ్ అయిన సబ్రిన మూవీ నుంచి లేపేశారు. అత్తారింటికి దారేది సినిమాలోని కొన్ని సీన్లను త్రివిక్రమ్ హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టారు. అయితే త్రివిక్రమ్ అభిమానులు మాత్రం ఇతర సినిమాల నుంచి త్రివిక్రమ్ ప్రేరణ పొందాడని కాపీ కొట్టలేదని అతనికే సపోర్ట్ చేస్తూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: