తమన్నా అంటే మిల్కీ బ్యూటీ. తళుకు బెళుకుల నాటీ. పోతపోసిన అందానికి ప్రతిరూపం. తమన్నాని అలా తన్మయత్వంగా చూస్తూ యూత్ గుండె ఎక్కడో జార్చేసుకుంది. పదిహేనేళ్ళ సినీ కెరీర్లో ఆమె గ్లామర్ ని గ్రామర్ ని కూడా కలిపి చూపిస్తోంది. ఇంకా నాటౌట్ అంటూ నీటుగా నటిస్తోంది.

 

మరి తమన్నా నోటి వెంట పాపం, శాపం వంటి మాటలు రావడం అంటే షాకే మరి. కానీ ఆమె ఎందుకంది, ఎవరిని అంది, ఎందుకింత  వైరాగ్యం. ఇంకా పెళ్ళి కూడా కానీ ఈ ముద్దు గుమ్మలో ఏమిటింత వేదాంతం..  అంతే నిజమే కదా అనిపిస్తుంది.కరోనా మహమారి ఇలా జనలా మీద పడి దేశాలకు దేశాలు చుట్టేస్తూంటే అందులో మానవాళి మొత్తం దహించుకుపోతూంటే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది.

 

అదే వైరాగ్యం తమన్నాకు కలిగాయి. ఆమె కరోనా వైరస్ వ్యాప్తి, మానవాళి పడుతున్న అవస్థల గురించి తనదైన శైలిలో విశ్లేషించారు. అదేంటి అంటే మానవాళి చేసిన తప్పులకు పాపాలకు ఇది ప్రక్రుతి విధించిన శాపం అంటున్నారు. ఈ భూమి మీద పక్షులను, మొక్కలను, జంతు జాలాన్ని లేకుండా చేసి అంతా తానేనని అన్నీ తానేనని మనిషి ధిక్కారంతో వీర విహారం చేతుంటే ఇలా కరోనా వచ్చిందని తమన్నా అంటోంది.

 

మనిషిని మళ్ళీ క్రమశిక్షణలో పెట్టేందుకే ఇలా కరోనా మహమ్మారి వచ్చిందని కూడా ఆమె అంటోంది. నిజంగా ఆమె బాగానే చెప్పింది కదూ. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. లేకపోతే ఇలా మనిషి మీద పగబట్టినట్లుగా వందల దేశాలకు కరోనా వైరస్ వ్యాపించడం ఏంటి. అందరినీ వణికించడమేంటి.

 

నిజంగా తమన్నా మంచి మాటలే చెప్పింది. ఇకనైనా మనిషి తానూ ప్రక్రుతిలో ఒక భాగంగా బతికితే వైరసుల బారి నుంచి కాపాడుకోగలరేమో. ఇపుడు అదే ప్రతీవారికీ తెలిసిరావాలేమో  కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: