జగన్ అంటే నిమ్మళంగా ఉంటారు. తన పని తాను చేసుకునిపోతారు. ఆయన అనవసరంగా ఒక్క మాట మాట్లాడరు. ఆర్భాటం అసలు చేయరు. ఇక హడావుడి లేకుండా పనిచేయడమే జగన్ కి అలవాటు. ఓ విధంగా జగన్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. దాంతో ఆయన గురించి ఎక్కువగా తెలుసుకునే అవకాశం పెద్దగా ఉండదు.

 

ఇక జగన్ తో సన్నిహితంగా ఉండేవారు చెప్పే మాట అయితే ఆయన చాలా దయ గుండె కలిగిన వారు అంటారు. అలాగే జగన్ హాస్పిటాలిటీ కూడా గొప్పగా ఉంటుంది అంటారు. అది అందరూ చెప్పేకన్నా మెగాస్టార్ చిరంజీవి చెబితే ఇంకా బాగుంటుంది కదా. చిరంజీవి గత ఏడాది జగన్ ఇంటికి వెళ్లారు. నాడు చిరంజీవికి జగన్ ఇచ్చిన ఆతీధ్యం గురించి ఇప్పటికీ  ఆయన చెబుతూంటారు. తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో చిరంజీవి ఇదే విషయం చెప్పారు.

 

తాను జగన్ ఇంట ఆతీధ్యం ఎప్పటికీ మరచిపోలేనని కూడా అన్నారు. ఇక తనకు జగన్ కుటుమంతో మంచి సాన్నిహిత్యం ఉందని కూడా చెప్పారు. తాను సాక్షి మీడియా  ప్రారంభోత్సవానికి వెళ్ళాలని, ఆ తరువాత సాక్షి ఎక్సె లెన్సీ  అవార్డుల ప్రదానానికి వెళ్ళాలని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ కుటుంబంతో తనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా చిరంజీవి చెప్పుకున్నారు.

 

ఇక తాను రాజకీయంగా ఈ మాటలు చెప్పడంలేదని, తాను రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నానని ఆయన అంటున్నారు. తనకు ఎవరు మంచి చేసినా మెచ్చుకోవడం అలవాటు అని, ఏపీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల ప్రతిపాదన బాగా నచ్చిందని, వికేంద్రీకరణ ఎప్పటికైనా మంచిదేనని, అది అంతిమంగా అందరికీ మేలు చేస్తుందని కూడా అన్నారు. మొత్తానికి జగన్, ఆయన ఆతిధ్యాన్ని చిరంజీవి మరచిపోలేకపోతున్నారన్న మాట.

నిజమే కదా ఇద్దరూ మంచివారే కాబట్టే అలా గుర్తుంచుకుంటున్నారు.
 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: