టాలీవుడ్ సినిమా సెలబ్రిటీల లాక్ డౌన్ టైం లో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటువంటి సమయంలో చాలా మంది సెలబ్రెటీలు వీడియో కాలింగ్ ద్వారా మీడియా చానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ అనేక విషయాలు పంచుకుంటున్నారు. ఇదే టైమ్ లో మరికొంత మంది సెలబ్రిటీస్ అయితే ఒకరికి ఒకరు ఛాలెంజ్ లు వేసుకుంటూ టైమ్ పాస్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల 'బి ది రియల్‌ మ్యాన్'‌ అనే ఛాలెంజ్‌ పేరుతో సోషల్ మీడియాలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, సుకుమార్, కొరటాల శివ అదేవిధంగా వెంకటేష్ మరి కొంత మంది స్టార్స్ చాలెంజ్ స్వీకరించి తమ ఇంటిలో భార్యలకు సహకరిస్తూ ఇంటి పనులు చేసి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 

ఈ వీడియోలను చూసి సదరు ఫ్యాన్స్ అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా కొనసాగుతుండగానే మరో పక్క బాలయ్య మరియు మహేష్ అభిమానులు కూడా ఈ విధమైన వీడియోలు చేయాలని ‘బి ది రియల్‌ మ్యాన్‌’ అనే ఛాలెంజ్‌ స్వీకరించాలని సోషల్ మీడియాలో తమ కోరిక చెబుతున్నారు. ఆల్రెడీ ఎన్టీఆర్ ఈ ఛాలెంజ్ ని  బాబాయ్ బాలకృష్ణకు అదేవిధంగా వెంకటేష్.. మహేష్ బాబు కి ఛాలెంజ్ చేయడం జరిగింది.

 

వీరిద్దరు కూడా తప్పకుండా ఛాలెంజ్‌ను స్వీకరిస్తారని అంతా నమ్మకంగా ఉన్నారు. కాని వీరిద్దరు మాత్రం ఇలాంటి వ్యవహారాలపై ఆసక్తి చూపరని, వీరిద్దరు ఈ ఛాలెంజ్‌ను లైట్‌ తీసుకునే అవకాశం ఉందని మరికొంతమంది అంటున్నారు. ఇదే సమయంలో ఈ చాలెంజ్ నీ నాగార్జున మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా చాలా లైట్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. వీరిద్దరూ ఇప్పటివరకు అస్సలు పట్టించుకోలేదు. ఇటువంటి ఛాలెంజ్ లు ప్రభాస్ స్వీకరించే అవకాశం ఉందని, మరి ప్రభాస్ స్వీకరిస్తే ఎలాంటి వీడియో చేస్తాడో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: