తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు మరియు ట్రెండ్ సెట్ చేసుకున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఫిలిం ఇండస్ట్రీ లో కొత్త వారిని అయన ఎప్పుడును ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్ లో ఖుషి సినిమా తరవాత ఎప్పుడూ తిరిగి చూసుకోలేదు. ఎందుకంటె పవన్ కళ్యాణ్ స్టామినా అంటే ఏంటో తెలిసింది ఆ సినిమా ద్వారానే. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ని ఆర్థికంగా నిలబెట్టింది. ఖుషి సినిమా ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్. పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలివరీ మరియు స్టైల్ ఈ సినిమాలో కొత్తగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ అంటే సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ మరియు క్రష్ ఉండని భామ ఉండదు. ఈ క్రమంలోనే ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

 

తెలుగు సినీ ఇండస్ట్రీలో తన గ్లామర్ తో సెగలు పుట్టిస్తున్న భామ నిధి అగర్వాల్. తెలుగు సినీ ఇండస్ట్రీలో సవ్యసాచి సినిమా ద్వారా పరిచయం అయ్యి తన నటనతో మెప్పించింది. కరోనా కాలంలో లాక్ డౌన్ లో లాక్ అయిన నిధి తన అభిమానులకు సోషల్ మీడియాలో ఆనందాన్ని పంచుతోంది. ఈ సందర్భంగా తనగురించి ఎన్నో కుశల ప్రశ్నలు గుప్పించారు. అయితే ఎక్కువమంది అడిగిన ప్రశ్నల కు సమాధానం చెప్పేపనిలో పడింది ఈ ఇస్మార్ట్ పోరి.  

 

 

 

అదేంటంటే మా అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణగారి గురించి ఏమన్నా చెప్పమని అడగరు.  దానికి ఈ అమ్మడు ఎటువంటి సందేహం మరియు బెరుకు గాని లేకుండా "పవన్ కళ్యాణ్ గారు తెలుగు సినిమా కు గిఫ్ట్ లాంటి వారు " అని ఇస్మార్ట్ ఆన్సర్ చేసింది ఈ ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్ ....పెళ్లి గురించి ప్రస్తావన రాగా.. దానికి ఇంకా చాలా టైముంది అంటూ..ప్రస్తుతం తన గోల్ మంచి సినిమాలు చేయడమే అని వివరణ ఇచ్చింది. అలాగే తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా వాటిని లెక్క చేయనని చెబుతూ.. నటిగా బిజీ అవ్వడమే తనకు ఎక్కువా సంతోషాన్ని కలిగించే విషయమని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: