విజయ్ దేవరకొండకి సీరియల్ కిస్సర్ అన్న పేరు వచ్చింది అర్జున్ రెడ్డి సినిమాతోనే. అంతకముందు నటించిన పెళ్ళి చూపులు సినిమాలో కనీసం హీరోయిన్ ని గట్టిగా కౌగిలించుకున్నదు లేదు. రొమాంటిక్ యాంగిల్ లో చూసింది లేదు. కాని అర్జున్ రెడ్డి సినిమాలో మాత్రం బాలీవుడ్ సినిమాని మించి రొమాన్స్ చూపించారు. అడల్ట్ కంటెంట్ అన్న భావన కలిగేలా సినిమాని తీశారు. విజయ్ దేవరకొండ లిప్  లాక్ ఫొటో పోస్టర్ వేసినప్పుడే ఈ సినిమాకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. కాంట్రవర్సీలు వచ్చినప్పటికి కథ లో భాగంగా వచ్చే డీప్ లిప్ లాక్స్ కి జనాలు వయసుతో సంబంధం లేకుండా వేడెక్కి చచ్చారు.

 

అదొక సెంటిమెంట్ గాను విజయ్ దేవరకొండ ఆ తర్వాత సినిమాలకి ఫాలో అయ్యాడు. బాలీవుడ్ లో ఈ తరహా పెదవి ముద్దులు పెట్టడంలో ఇమ్రాన్ హష్మీ కి సీరియల్ కిస్సర్ అన్న నేం ఉంది. ఆ తర్వాత ఎంత మంది హీరోలు ట్రై చేసినా ఇమ్రాన్ కి వచ్చినంత నేం రాలేదు. అదే నేం అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకి వచ్చింది. అంతే ఇక ప్రతీ సినిమాలోను ఒక లిప్ లాక్ ఉండేలా చూసుకుంటున్నాడు. మరి అది విజయ్ కావాలని ఇరికిస్తున్నాడా ..లేక మేకర్స్ పరవాలేదు హీరోయిన్ కి ముద్దు పెట్టేయ్ అని చెబుతున్నారా తెలియడం లేదు గాని లిప్ లాక్ మాత్రం విజయ్ సినిమాలో ఉంటుంది. 

 

కొన్ని సినిమాలలో కొన్ని సీన్స్ చూస్తే కావాలనే ఇక్కడ లిప్ లాక్ పెట్టారా అని సందేహం కలుగుతుంది. ద్వారక సినిమాలో ఉన్న లిప్ లాక్ అలానే అనిపిస్తుంది. గుడిలో హీరోయిన్ ని ముద్దు పెట్టుకోవడం కావాలని పెట్టినట్టే ఉంటుంది. ఇక గీత గోవిందం సినిమాలో ఇద్దరి మధ్య గొడవ వచ్చేది సినిమా మొత్తం కథ నడిపేది అనుకోకుండా జరిగిన ఈ ముద్దే. ఈ సినిమాలో ఎండ్ టైటిల్ లో కూడా విజయ్ దేవరకొండ ని రష్మిక ముద్దు పెట్టుకుంటుంది.

 

ఇది సెంటిమెంట్ గా ఫీలయి ఫాలో అయ్యారేమో ఈ ఇద్దరు కలిసి నటించిన డియర్ కామ్రేడ్ సినిమాలోను లిప్ లాక్ పెట్టారు. ఇది అంత అవసరం లేదన్న టాక్ అప్పట్లో బాగా వినిపించింది. అయితే ఈ లిప్ లాక్ ఉంటే యూత్ బాగా అట్రాక్ట్ అవుతారన్న ఉద్దేశ్యంతోనే పెట్టారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: